వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలంలో పడిపోయిన తేజస్ ఫ్యూయల్ ట్యాంక్

|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు : ఇండియన్ ఆర్మీకి చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎల్‌సీఏ తేజస్ విమాన ఫ్యూయల్ ట్యాంక్ ఊడి పడింది. తమిళనాడులో ఓ పొలంపై నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం విమానం సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

మంగళవారం ఉదయం ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజన్ విమానం సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఓ వ్యవసాయ భూమిలో అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో పొలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యవసాయ భూమిలో పడిన ఫ్యూయల్ ట్యాంక్ అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించేది కావడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించారు.

Air Force Planes Additional Fuel Tank Falls Mid Air

గతవారం హర్యానాలోని అంబాలాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక ఇంజన్ పనిచేయడం మానేసింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఇంధనం, ఇతర తేలిక బాంబులను పైలెట్ కిందకు వదిలేశాడు. అనంతరం యుద్ధ విమానంను అంబాలా ఎయిర్‌బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

English summary
An Indian Air Force jet dropped its external fuel tank over empty farm land near Coimbatore while flying a routine "sortie" today. The plane, a Tejas managed to land safely at Sulur Air Force Station
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X