వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యర్‌ను తొలగించాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్, రాహుల్‌కు హనుమంతరావు లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని తాను తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ రాశానని మాజీ ఎంపీ హనుమంత రావు చెప్పారు.

ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన మరోమారు నోరు జారారు.

పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Aiyar must be expelled lest BJP takes advantage of remarks: Congress leader

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న జమాత్ ఈ ఇస్లామీ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాయని, పాకిస్తాన్‌లో మార్పులు వస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్‌ను ఇష్టపడుతున్నానని చెప్పారు.

జమ్ముకాశ్మీర్‌లోని సంజ్వాన్‌లో సైనిక శిబిరంపై పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు దాడి చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆపేయాలని, ఆయన ఇప్పటికే సస్పెండయ్యారని హనుమంత రావు అన్నారు. అయ్యర్‌ను పార్టీ నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు.

English summary
Senior Congress leader and former MP, Hanumantha Rao has said that he will write to party chief Rahul Gandhi requesting him to expel Mani Shankar Aiyar for saying that while most political parties in Pakistan want cordial relations with India, those in India are "still caught in a partially 1947 situation".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X