వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు, ఐదుగురు సిట్టింగ్ లకు మొండిచేయి చూపిన అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో సిట్టింగ్ లకు టిక్కెట్లను నిరాకరించారు. ఐదుగురు సిట్టింగ్ లకు ఎస్ పి టిక్కెట్లు దక్కలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మద్య పొత్తు కుదిరింది,అయితే సిట్టింగ్ ఎంఏల్ఏలకు టిక్కెట్లు కేటాయించలేదు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.గెలుపు గుర్రాలకే ఆయన టిక్కెట్లను కేటాయిస్తున్నారు. నేరచరిత్ర ఉన్నవారిని కూడ దూరం పెడుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను సమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీచేస్తోంది.

అయితే సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ టిక్కెట్లు నిరాకరించిన వారికి అఖిలేష్ యాదవ్ పెద్దపీట వేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీపార్టీ అద్యక్షుడిగా ఉన్న కాలంలో బాబాయి శివపాల్ యాదవ్ పక్కన పెట్టిన అభ్యర్థులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి టిక్కెట్లను కేటాయించారు అఖిలేష్.

గెలుపు గుర్రాలకే అఖిలేష్ టిక్కెట్ల కేటాయింపు

గెలుపు గుర్రాలకే అఖిలేష్ టిక్కెట్ల కేటాయింపు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అఖిలేష్ వ్యూహరచన చేస్తున్నారు.ఈ మేరకు ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ఆయన టిక్కెట్లను కేటాయిస్తున్నారు.దరిమిలా గెలుపుకు ఆమడ దూరంలో ఉన్న సిట్టింగ్ ఎంఏల్ఏలకు అఖిలేష్ టిక్కెట్లను నిరాకరిస్తున్నారు.పార్టీ విజయమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అఖిలేష్

రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అఖిలేష్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకముందే సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఆదివారం నాడు సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదిరింది. ఈ పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను విడుదల చేశాడు సమాజ్ వాదీ పార్టీ. ఈ జాబితాలో 77 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది ఆ పార్టీ.అయితే ఈ జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎంఏల్ఏలకు టిక్కెట్లకు ఇవ్వకుండా నిరాకరించారు అఖిలేష్ యాదవ్.ఆమేథీలో ఇద్దరు సిట్టింగ్, రాయ్ బరేలీలో ముగ్గురు సిట్టింగ్ ఎంఏల్ఏలకు అఖిలేష్ యాదవ్ టిక్కెట్లు కేటాయించలేదు.

నేరచరిత్ర ఉన్న నాయకులకు టిక్కెట్ల నిరాకరణ

నేరచరిత్ర ఉన్న నాయకులకు టిక్కెట్ల నిరాకరణ

నేరచరిత్ర ఉన్న నాయకులకు టిక్కెట్లను కేటాయించేందుకు నిరాకరించారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.ఓ కేసులో జైలుపాలైన రాజకీయనాయకుడు ముఖ్తార్ అన్సారీకి అఖిలేష్ యాదవ్ టిక్కెట్టును నిరాకరించారు.మాఫీయా లీడర్లు, నేరచరిత్ర ఉన్న వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు అఖిలేష్ వెనుకంజ వేస్తున్నారు.ఇదే విషయంలో బాబాయి శివపాల్ యాదవ్ తో అఖిలేష్ విభేదించారు. ఓ మాఫియా లీడర్ ను పార్టీలో చేర్చుకొనేందుకుగాను శివపాల్ యాదవ్ ఆసక్తిని చూపగా, అఖిలేష్ మాత్రం ఆయనను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకించారు.

పార్టీని విలీనం చేసినా టిక్కెట్టు దక్కలేదు.

పార్టీని విలీనం చేసినా టిక్కెట్టు దక్కలేదు.

శివపాల్ యాదవ్ ప్రోద్బలంతో అన్సారీ తన ఖ్వామీ ఎక్తాదళ్ పార్టీని గత ఏడాదిలో సమాజ్ వాదీ పార్టీలో ఆయన తన పార్టీని విలీనం చేశారు.అయితే పార్టీని విలీనంచేసినా కాని ఆయనకు సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టు దక్కలేదు.ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంఏల్ఏగా కూడ ఉన్నారు.అయితే ఆయనను కాదని ఆయన స్థానంలో మరో ముస్లిం అభ్యర్థి అల్తాప్ అన్సారీకి అవకాశమిచ్చారు.

అలహాబాద్ యూనివర్శిటీ మాజీ అధ్యక్షుడికి టిక్కెట్టు

అలహాబాద్ యూనివర్శిటీ మాజీ అధ్యక్షుడికి టిక్కెట్టు

గత ఏడాది సమాజ్ వాదీపార్టీలో అలహాబాద్ యూనివర్శిటీ సంఘం మాజీ అధ్యక్షుడు రిచా సింగ్ చేరారు. ఆయనకు సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టును కేటాయించాడు అఖిలేష్ యాదవ్.అయితే కొత్త వారికి టిక్కెట్లు కేటాయించినా సిట్టింగ్ లు కొందరికి మాత్రం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ టిక్కెట్లను నిరాకరించారు.ఆమేథి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గాయత్రిప్రసాద్ ప్రజాపతి, గురురిగంజ్ నుండి రాకేష్ ప్రతాప్ సింగ్ లతో పాటు , రాయ్ బరేలీలోని సిట్టింగ్ ఎంఏల్ఏలు ఆశాకిషోర్, దేవేంద్రప్రతాప్ సింగ్ , మనోజ్ కుమార్ పాండే లకు అఖిలేష్ టిక్కెట్లను కేటాయించారు.

English summary
akhilesh denies ticket to sitting mlas in uttrapradesh assembly elections. akhilesh released second list of samajwadi party list. five sitting mlas names not in akhilesh list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X