వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ పై సవారీ ఎవరిదో , ములాయంపై అఖిలేష్ పై చేయి సాగేనా?

ఎన్నికల గుర్తు కోసం ఈ నెల 13వ, తేదిన తమ వాదనలను విన్పించాలని ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ లకు ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :'గుర్తు కోసం ఎన్నికల కమీషన్ తలుపు తట్టిన సమాజ్ వాదీ పార్టీ నాయకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లకు ఎన్నికల కమీషన్ నిద్ర పట్టకుండా చేస్తోంది. ఎన్నికల గుర్తు ఎవరికీ ఇవ్వాలనే విషయమై ఇరు వర్గాల వాదలను ఈ నెల 13వ, తేదిన వినాలని ఈసీ నిర్ణయించింది.అయితే ములాయం, అఖిలేష్ యాదవ్ లు మాత్రం కలిసిపోయారు. ఎన్నికల కమీషన్ ముందు రెండు గ్రూపులు ఏ రకమైన వాదనలు విన్పిస్తారో చూడాలి.

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభానికి తెరపడింది.అయితే పార్టీ ఎన్నికల గుర్తు కోసం తండ్రి కొడుకులు పోటాపోటీగా ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్లు సమర్పించారు.

ఎన్నికల గుర్తు కేటాయింపు విషయమై ఇద్దరు నాయకులు తమకు మద్దతిచ్చే నాయకులతో అఫిడవిట్లు ఇచ్చారు. అయితే ఇద్దరి మద్య గొడవ మూలంగా పార్టీ ఎన్నికల గుర్తును ఇద్దరికీ కేటాయించకుండా వేర్వేరు గుర్తులను ఇస్తారనే ప్రచారం సాగింది.

అదే సమయంలో తండ్రి తనయుల మద్య రాజీ కుదిరింది. మంగళ వారం నాడు తండ్రి కొడుకులు సుధీర్ఘంగా మంతనాలు చేశారు. వీరిద్దరి మద్య ఏ రకమైన రాజీ కుదిరిందనే విషయం మాత్రం బయటకు రాలేదు.

ములాయం, అఖిలేష్ వాదననలను విననున్న ఈసీ

ములాయం, అఖిలేష్ వాదననలను విననున్న ఈసీ

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ల వాదనలను ఈసీ వినాలని నిర్ణయం తీసుకొంది. ఎన్నికల గుర్తు విషయమై ఇద్దరు కూడ ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ నెల 13వ, తేదిన తమ ముందు ఇద్దరు నాయకులు వాదనలను విన్పించాల్సిందిగా ఎన్నికల కమీషన్ ఇద్దరికీ సూచించింది. ఈ మేరకు ఈ నెల 13వ, తేదిన ఎన్నికల కమీషన్ ముందు రెండు గ్రూపులు హజరుకానున్నాయి.తమ వాదనలను విన్పించనున్నాయి.

తొలి దశ నామినేషన్లకు ముందే గుర్తుపై స్పష్టత

తొలి దశ నామినేషన్లకు ముందే గుర్తుపై స్పష్టత

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ, తేది నుండి తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎన్నికల గుర్తుపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. ఈ మేరకు గుర్తు కోసం పోటాపోటీగా కమీషన్ ను ఆశ్రయించిన నేతలకు నోటీసులను పంపింది కమీషన్. తండ్రి, తనయులు రాజీకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే అఖిలేష్ వైపే పార్టీ నాయకులు ఉన్నారు. ములాయం సింగ్ వైపు పార్టీ నాయకలు నామమాత్రంగానే ఉన్నారు. అయితే ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతారా లేదా గతంలో ఉన్నట్టుగానే ఈ పరిస్థితి కొనసాగించాలని కోరుతారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

పార్టీలో అఖిలేష్ దే పై చేయి

పార్టీలో అఖిలేష్ దే పై చేయి

సమాజ్ వాదీ పార్టీలో ప్రస్తుతానికి అఖిలేష్ వర్గానిదే పై చేయిగా కన్పిస్తోంది. ఈ నెల 1వ, తేదిన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ను ఎన్నుకొన్నారు.చఈ సమావేశానికి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కూడ హజరయ్యారు. ములాయం సింగ్ నుండి ఈ పదవిని అఖిలేష్ కు కట్టబెడుతూ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మాణం చేసింది. అమర్ సింగ్, శివపాల్ యాదవ్ లను పార్టీ బాద్యతల నుండి తప్పించాలని అఖిలేష్ డిమాండ్ చేస్తున్నారు. అయితే అఖిలేష్ కు మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ యాదవ్ పై ములాయం సింగ్ మరోసారి సస్పెన్షన్ వేటు వేశాడు. రాజ్యసభ చైర్మెన్ హమీద్ అన్సారీకి రామ్ గోపాల్ యాదవ్ పై చర్య తీసుకోవాలని ములాయం లేఖ కూడ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఖిలేష్, ములాయం లు రాజీకీ వచ్చాయి.అయితే రాజీ ఫార్మూల విషయం మాత్రం బయటకు రాలేదు.

అమర్ నుములాయం వదులుకొంటారా

అమర్ నుములాయం వదులుకొంటారా

సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ రీ ఎంట్రీ కారణంగానే సంక్షోభం మరింత తీవ్రమైంది. అమర్ సింగ్ ను పార్టీకి దూరంగా ఉంచాలని అఖిలేష్ కోరుతున్నాడు.అయితే అఖిలేష వాదనలను లెక్కచేయకుండా ములాయం సింగ్ అమర్ ను తిరిగి పార్టీలోకి తీసుకొన్నారు. మరో వైపు శివపాల్ యాదవ్ కు ఉత్తర్ ప్రదేశ్ బాద్యతలు ఇవ్వకూడదని కూడ అఖిలేష్ కోరుతున్నాడు. ఈ రెండు డిమాండ్లను ములాయం సింగ్ పెడచెవిన పెట్టాడు. దీంతో అఖిలేస్ చక్రం తిప్పి పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడే పార్టీ నుండి అమర్ ను, శివపాల్ ను తప్పించడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని ములాయం సింగ్ అఖిలేష్ దృస్టికి తీసుకువచ్చాడని సమాచారం.

English summary
akhilesh and mulayam singh fight for cycle ,election commission issued notice to akhilesh and mulayam for their opinions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X