Radhika merchant: దివి నుండి భువికి వచ్చిన దేవకన్యలా..
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి ముందు మామెరు వేడుకను బుధవారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రాణి పింక్ లెహంగాలో చాలా ప్రత్యేకంగా రాధికా మర్చంట్
అయితే అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహానికి ముందు జరిపించిన ఈ మామెరు వేడుకలో నూతన వధువు రాధిక మర్చంట్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన రాణి పింక్ లెహంగాలో చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఈ లెహంగా బోర్డర్ పైన దుర్గాదేవి శ్లోకాలను బంగారు తీగలతో ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించారు.

దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా
ఈ అద్భుతమైన డ్రెస్ తో మెరిసిపోయిన రాధిక మర్చంట్ ఈ ఫంక్షన్ కు తన తల్లి నగలను అలంకరించుకొని చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించారు. బంగారు నక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయారు రాధికా మర్చంట్. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ మనవళ్ళు, మనవరాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మామెరు వేడుక ప్రత్యేకత
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి అయిన రాధిక మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తున్న వేళ జరిగిన ఈ మామెరు వేడుక అతిథులకు చాలా స్పెషల్ గా నిలిచింది. ఇక ఈ మామెరు వేడుక ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక గుజరాతి సాంప్రదాయ వేడుక.
మామెరు వేడుక నిర్వహించిన నీతా అంబానీ పుట్టింటి వాళ్ళు
దీని ప్రకారం వివాహానికి ముందు వరుడు తల్లి పుట్టింటి వాళ్ళు లేదా మేనమామలు సాంప్రదాయ బద్ధంగా కాబోయే వధూవరులకు కానుకలు తీసుకొచ్చి ఆశీర్వాదాలు అందిస్తారు. ఇందులో భాగంగా నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరీ మమతా తదితరులు ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చి కాబోయే దంపతులకు బహుమతులను ఇచ్చి ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ముఖేష్ అంబానీ దంపతులు.












Click it and Unblock the Notifications