వీడియో: పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్.. మిలటరీ పోస్ట్ ల ధ్వంసం!
భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గామ్ లో ఉగ్ర దాడికి సమాధానంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఘటన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చొరపాటుకు యత్నం చేస్తోంది.
పాక్ దాడులను తిప్పి కొడుతున్న భారత్
అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉన్న బారాముల్లా నుండి భుజ్ వరకు పాకిస్తాన్ 26 చోట్ల డ్రోన్లు ప్రయోగించింది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే, పాకిస్తాన్ తాము దాడులు చేయలేదని చెప్పడం వారి ద్వంద్వ వైఖరికి మరో ఉదాహరణ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.

పాకిస్తాన్ కు మరొక షాక్
ఇదిలా ఉంటే భారత్ మీద వరుస దాడులు కు తెగబడుతున్న పాకిస్తాన్ కుటిల యత్నాలను భారత్ అడుగడుగున తిప్పి కొడుతోంది. ఒకవైపు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే కూల్చేస్తూ దాడులను తిప్పి కొడుతున్న భారత్, మరోవైపు కౌంటర్ ఎటాక్ లతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ కు మరొక షాక్ ఇచ్చింది భారత్. జమ్మూలోని దయాది మిలిటరీ పోస్టును ధ్వంసం చేసింది.
#WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources
— ANI (@ANI) May 10, 2025
(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw
పాక్ మిలటరీ పోస్ట్ ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ
జమ్మూ సమీపంలో ఉన్న భారతసైన్యం, ట్యూబ్ లాంచ్డ్ డ్రోన్లను ప్రయోగించే పాకిస్తాన్ పోస్టులు మరియు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది అని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్ కు చెందిన పలు సైనిక పోస్టులను భారత భద్రత బలగాలు ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ ను మరింత బలహీనం చేస్తున్నాయి. ప్రస్తుతం జమ్మూలోని పాకిస్తాన్ మిలిటరీ పోస్టును ధ్వంసం చేసిన వీడియోలు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ కు నిద్రలేకుండా చేస్తున్న భారత్
ఇక ఈ వీడియోలు చూసిన వారంతా పాకిస్తాన్ ఇకనైనా తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే అని అంటున్నారు. భారతదేశ సత్తాను, దక్షిణ వ్యవస్థ యొక్క శక్తిని చాటుతున్న త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నారు పాకిస్తాన్ కు నిద్ర లేకుండా చేస్తున్నారని తెగ మెచ్చుకుంటున్నారు












Click it and Unblock the Notifications