వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే కొలువున్నట్టు..! లేకపోతే ఉద్యోగం ఊడినట్టే..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా ఆంక్షలతో సతమతవుతున్న ఉద్యోగులకు మరో నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం లోని ఉద్యోగులందరూ పాటించాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రయివేటు సంస్ధల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులకు కూడా ఇవే ఆదేశాలను అమలు చేసి విధంగా ఆయా యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే, తప్పనిసరిగా ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తీరాల్సిందేనని స్పష్టం చేస్తోంది.

కరోనా : ఈ-పాస్‌గా ఆరోగ్య సేతు..? సాధ్యమేనా...? సైబర్ నిపుణులు ఏమంటున్నారు.. కరోనా : ఈ-పాస్‌గా ఆరోగ్య సేతు..? సాధ్యమేనా...? సైబర్ నిపుణులు ఏమంటున్నారు..

అందరికీ ఆరోగ్య సేతు.. తప్పనిసరి చేస్తున్న కేంద్రం..

అందరికీ ఆరోగ్య సేతు.. తప్పనిసరి చేస్తున్న కేంద్రం..

ఒకవేళ ఎవరైనా కేంద్ర ఉద్యోగి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని పక్షంలో వారిని ఆఫీసుకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యసేతు యాప్ ను ప్రతి ఒక్కరు ఉపయోగించాలని, కరోనా గుర్తింపు సాధనంగా గా ఇది పని చేస్తున్నందున ప్రతి ఉద్యోగి దీని ప్రాధాన్యత తెలుసుకుని అమలు చేసుకోవాలని కేంద్ర పెద్దలు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ డౌన్ లోడ్ తప్పనిసరి చేయటం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగుల నుండి, ఉద్యోగ సంఘాల నుండి ఈ యాప్ పట్ల అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరోగ్యసేతు డౌన్ లోడ్ చేసుకోవాలి.. ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

ఆరోగ్యసేతు డౌన్ లోడ్ చేసుకోవాలి.. ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య సమాచారాన్ని పరీక్షించుకోవటంతో పాటు, తమ చుట్టుపక్కల ప్రాంతాల వారి కరోనా పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే వీలుందని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తోటి ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఉద్యోగితో పాటు తాను సంప్రదిస్తున్న ప్రతి వ్యక్తి భద్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి బాద్యతగా అందరూ ఈ యాప్ గురించి తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

ఆరోగ్యసేతు ఎంతో సురక్షితం.. అందరూ పాటించాలన్న కేంద్రం..

ఆరోగ్యసేతు ఎంతో సురక్షితం.. అందరూ పాటించాలన్న కేంద్రం..

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఈ యాప్ వల్ల సదరు ఉద్యోగి సురక్షితమని, ఎలాంటి వైరస్ ప్రమాదం లేదని నిర్ధారణ జరిగుతుందని, అలా సూచించిన ఉద్యోగిని మాత్రమే ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతిస్తారని స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంతో పాటు, ఈ యాప్ లో తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత, సదరు వ్యక్తి ఉండే ప్రదేశం, ఆ వ్యక్తి చుట్టు పక్కల ఉన్న వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉంటే, వెంటనే అలెర్టు చేస్తుంది ఈ యాప్. అందుకోసమే దీని ప్రాధాన్యత గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తోంది.

కరోనా వైరస్ లక్షణాలను బయటపెడుతుంది.. అందరికీ శ్రేయస్కరమంటున్న మోదీ సర్కార్..

కరోనా వైరస్ లక్షణాలను బయటపెడుతుంది.. అందరికీ శ్రేయస్కరమంటున్న మోదీ సర్కార్..

అంతే కాకుండా ఆరోగ్య సేతూ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేస్తోంది. దాంతో పాటు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం ఈ నిబంధన అమలవుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం విధించిన తాజా షరతులతో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ లు పెద్ద ఎత్తున జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆరోగ్య సేతు చురుగ్గా పని చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశం పట్ల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

English summary
Central government employees across the country should download the Arogya Setu aap.The central government has made it clear that it must download the government-created Health Setu App.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X