• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు: నోట్ల రద్దు ఎఫెక్ట్ టు సర్వీస్ ఛార్జీల తొలగింపు దాకా..

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి వార్షిక బడ్జెట్‌ సమర్పించారు. గతంలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం పేరుతో కాకుండా ఈసారి రంగాల వారీగా బడ్జెట్‌ రూపొందించారు. పూర్తి బడ్జెట్‌ రూ. 21.47లక్షల కోట్లు. రైల్వేలకు రూ.1.31లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం లోకసభ శుక్రవారానికి వాయిదాపడింది.

కేంద్ర బడ్జెట్: తగ్గనున్న ఇళ్ల ధరలు, ఆదాయపన్నులో కీలక మార్పులు?

రాజకీయ పార్టీల విరాళాలపై ఆంక్షలు

- పార్టీలకు విరాళాలపై మరింత పారదర్శకత ఉంటుందని చెప్పారు.

- పార్టీలకు నగదు విరాళం రూ.2వేలకి మించవద్దు.

- పార్టీలు చెక్కుల ద్వారానే విరాళాలు తీసుకోవాలి.

- పార్టీలకు విరాళాలపై ఆర్బీఐ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల ప్రతిపాదన

రూ.3 లక్షలకు మించి సాధ్యం కాదు

- బ్యాంకుల్లో నగదు డిపాజిట్, విత్ డ్రా రూ.3 లక్షలకు మించి సాధ్యం కాదని చెప్పారు.

- నికర పన్ను ఆదాయం 17 శాతం పెరిగింది.

ఆదాయం తక్కువ చూపిస్తున్నారు

- బడ్జెట్‌లో ప్రధాన అంశాలు నల్లధనంపై యుద్ధం, ఇళ్ల నిర్మాణం.

- నల్లధనంపై సిట్ సూచనలు స్వీకరిస్తున్నాం.

- ఎల్‌ఎన్‌జీపై కస్టమ్స్ తగ్గింపు

- ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు అతికొదది మందే.

- చాలామంది తమ ఆదాయం తక్కువ చేసి చూపిస్తున్నారు.

- స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం

- మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.21 లక్షల 47 కోట్లు

- మూలధన వ్యయం 25 శాతం పెంపు

- రెవెన్యూ లోటు 1.9 శాతం. ఆర్థిక లోటు 3.2 శాతం.

- రక్షణ బడ్జెట్ 2.74 లక్షల కోట్లు

- మహిళా శక్తి కేంద్రాలకు రూ.500 కోట్లు

- బీమ్ యాప్ ప్రోత్సాహానికి రెండు కొత్త స్కీంలు

- బీమ్ యాప్ వినియోగదారులకు ఇన్‌సెంటివ్స్

- ఆర్మీ పింఛన్ దారులకు ఇక నుంచి ఆన్ లైన్లో చెల్లింపులు.

ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనానికి చట్టం..

- విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు నిబంధనల సరళతరం

- ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనానికి కొత్త చట్టం.

- వైద్య పరికరాల ఖర్చులు తగ్గించేందుకు కొత్త నిబంధనలు

బడ్జెట్: సానుకూలంగా సెన్సెక్స్, స్వల్పంగా బలపడిన రూపాయి

- గ‌ర్భిణి ఆస్ప‌త్రి ఖ‌ర్చుల‌కు రూ.6వేల బ‌ద‌లాయింపు.

- మౌలిక రంగానికి రూ.3,96,135 కోట్లు

- హైస్పీడ్ బ్రాండ్ బ్యాండ్ అనుసంధానికి ప్రాధాన్యం. ఇందు కోసం డిజిగ‌వ్ ప‌థ‌కం. దేశ‌మంతా హాట్‌స్పాట్

- హెడ్ పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు సేవలు

- ఆర్థిక భద్రతకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ స్కీమ్.

- ఐఆర్‌సీటీసీ, ఇర్కాన్ సంస్థలను మార్కెట్‌లో లిస్టింగ్ ఇస్తాం.

- బీమ్ యాప్ ద్వారా మొబైల్ పేమెంట్స్.

- ఆర్బీఐ ఆధ్వర్యంలో పేమెంట్ రెగ్యూరేటరీ బోర్డు

- ఈ పేమెంట్స్ సామాన్యులకు మేలు.

- 50 వేల గ్రామ పంచాయతీల్లో పేదరిక నిర్మూలన.

- త్వరలో ఆధార్ పేను ప్రారంభిస్తాం.

- ఈ-పేమెంటులను ప్రోత్సహిస్తాం.

- బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ.10వేల కోట్లు.

- మిషన్ అంత్యోదయ కింద కోటి ఇళ్ల నిర్మాణం.

నాడు అలా-నేడు ఇలా: 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈయనే, ఆసక్తికరాంశాలు

- ఎస్సీల సంక్షేమ నిధి 55 వేల 393 కోట్లు

- మౌలిక సౌకర్యాల కోసం రూ.3.96 లక్షల కోట్లు.

- పరిశీలనలో కొత్త ఎఫ్‌డీఐ పాలసీ.

- ఎఫ్ఐపీబీ రద్దు.. త్వరలో ప్రత్యమా్నాయం.

- గ్రామాలకు బ్రాడ్ కనెక్టివిటీ కోసం రూ.10వేల కోట్లు.

- ఒడిశా, రాజస్తాన్‌లలో క్రూడ్ ఆయిల్ నిర్వహణకు ప్రణాళికలు

- ఎయిర్ పోర్టు అథారిటీ చట్టానికి సవరణలు

- నేషనల్ హైవేలకు రూ.64వేల కోట్లు.

- కార్మిక చట్టాలను సరళతరం చేస్తాం.

- విద్యా రంగానికి డీటీహెచ్ చానల్.

- 20వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్ ప్లాంట్లు.

రైల్వేల్లో భద్రత కోసం రూ.లక్ష కోట్లు.. ఈ టిక్కెట్లపై సర్వీస్ ఛార్జీ తొలగింపు..

- నూతన మెట్రో రైలు విధానం ప్రకటిస్తాం.

- దేశ‌మంత‌టా భార‌తమెట్రో సేవలు.

- రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు.

- ఐఆర్సీటీసీ ఈ టిక్కెట్లపై సర్వీస్ ఛార్జీ తొలగింపు

- రైల్వేలలో భద్రత కోసం రూ.లక్ష కోట్ల నిధి. ప్రయాణీకుల భద్రతకు లక్ష కోట్ల కార్పరస్ ఫండ్.

- 2020 నాటికి కాపలా లేని రైల్వే క్రాసింగులు ఉండవు.

- 2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు.

- వృద్ధులకు ఆధార్ - ఆధారిత స్మార్ట్ కార్డులు.

- పర్యాటకుల కోసం ఇకపై ప్రత్యేక రైళ్లు.

- స్వచ్ఛ భారత్ తరహా.. ఇక స్వచ్ఛ రైళ్లు.

- 2017-18 నాటికి 3,500 కిలోమీటర్ల రైల్వే లైన్.

- త్వరలో కొత్త మెట్రో రైలు పాలసీ.

కార్లు ఎలా కొంటున్నారు?: ఆదాయపన్నుపై జైట్లీ షాకింగ్ కామెంట్స్

గుజరాత్‌కు ఎయిమ్స్..

- గ్రామాల్లో అభివృద్ధి 42 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది.

- ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచి నీటి సరఫరా.

- జార్ఖండ్, గుజరాత్‌లకు రెండు కొత్త ఎయిమ్స్.

- 2022 నాటికి 5 లక్షల మందికి వృత్తి నిపుణులకు శిక్షణ

3 లక్షల వరకు మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను..., ఎవరు ఎంత కట్టాలి?

నోట్ల రద్దు పుణ్యమే

- బ్యాంకుల్లో వడ్డీల రద్దు నోట్ల రద్దు పుణ్యమే.

- చౌక ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం. మొలిక సౌకర్యాల కింద ప్రతిపత్తి కల్పిస్తాం.

- మహిళలు, పిల్లల సంక్షేమానికి రూ.లక్షా 84వేల కోట్లు.

- 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన

- పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలకు పాలవెల్లువ.

- ఉపాధి పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం.

- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం.

- ప్రధానమంత్రి పజల్ యోజన కింద రోడ్లు., 133 కి.మీ. ప్రతి రోజు నిర్మించనున్నాం.

- స్వచ్ఛ భారత్‌కు విశేష స్పందన.

- ఐటీసీ ద్వారా విద్యా బోధన. అన్ని పరీక్షలకు ఒకే సంస్థ.

- జాతీయ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాం

100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్

- ప్రధాని ఆవాస్ యోజనకు రూ.23వేల కోట్లు

- జా తీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు.

- గ్రామీణం, వ్యవసాయనికి రూ.87వేల కోట్లు

- రూ.5వేల కోట్లతో మైక్రో ఇరిగేషన్ ఫండ్

- పేదలకు కోటి ఇళ్ల నిర్మాణం.

- పంటల భీమా పథకానికి రూ.13వేల కోట్ల కేటాయింపు.

- 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్

- 2018 నాటికి కరెంట్ లేని ఇల్లు ఉండదు.

- 2019 నాటికి బలహీన వర్గాలకు కోటి ఇళ్ల నిర్మాణం.

- మాధ్యమిక విద్య కోసం ఇన్నోవేషన్ ఫండ్

- విద్యా, స్కిల్ డెవలప్‌మెంట్‌తో యువతకు ఉపాధి.

- యూజీసీని సంస్కరిస్తాం.

- జాతీయ ఎంట్రెన్స్ పరీక్షలకు స్వయంప్రతిపత్తి సంస్థ.

బ్యాంకుల్లో డిపాజిట్లు, తగ్గనున్న 'రుణ'భారం

- బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి.

- రైల్వేలకు అధిక ప్రాధాన్యం.

- విద్యా, స్కిల్ డెవలప్‌మెంట్‌తో యువతకు ఉపాధి.

- కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం కొత్త చట్టం

రైతులకు..

- రైతులకు రుణ సాయంలో లోపం ఉండదు. పంటల బీమా కవరేజ్ పెంచుతున్నాం.

- రైతుల రుణాలపై 60 రోజుల పాటు వడ్డీ మాఫీ. రూ.5వేల కోట్లతో మైక్రో ఇరిగేషన్ ఫండ్

- కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్స్త.

- రైతుల ఆదాయం రెండింతలు చేయడం లక్ష్యం.

- డెయిరీల అభివృద్ధికి రూ.80వేల కోట్లు.

- జాతీయ వ్యవసాయ మార్కెట్ల సంఖ్య 585కు పెంపు.

- సూక్ష్మ వ్యవసాయానికి నాబార్డు ద్వారా ప్రత్యేక నిధులు.

- డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్లకు భారీగా నిధులు.

- సాయిల్ హెల్త్ కార్డులకు మరింత ఊతం

- ఫసల్ బీమా యోజనకు నిధల్లో రూ.41 శాతం.

- పంటల భీమా కవరేజ్ పెంచుతున్నాం. రైతులకు సాయంలో లోపం ఉండదు.

- రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం తమ లక్ష్యం. రైతులకు ఏడాదికి రూ.10 లక్షల కోట్ల రుణం ఇవ్వడం లక్ష్యం.

- పన్ను ఎగవేతదారులు పట్టుబడుతున్నారు. నల్లధనానికి కళ్లెం పడింది.

- నల్లధనంపై పోరు కొనసాగిస్తున్నాం.

- రీమానిటైజేషన్ పుంజుకుంది.

- నోట్ల రద్దు ఫలితాలు కనిపిస్తున్నాయి. దొంగనోట్లు ఉగ్రవాదానికి ఊతం ఇచ్చాయి.

- గత రెండేళ్లుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్టీ ఒకటి.

- తయారీ రంగంలో ఆరో స్థానంలో ఉన్నాం

క్లీన్ ఇండియా.. టెక్ ఇండియా వైపు పయనం

ప్రతి అడుగు గ్రామీణం వైపు అన్నారు. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం చారిత్రాత్మకం అన్నారు. క్లీన్ ఇండియా-టెక్ ఇండియా వైపు పయనిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలపై తమ దృష్టి అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండరాదనే ఫిబ్రవరి 1వ తేదీకి బడ్జెట్‌ను మార్చామని చెప్పారు. ద్రవ్యోల్భణం 1 నుంచి 0.7కు తగ్గిందన్నారు.

విదేశీ మారక ద్రవ్యం..

అంత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని ఐఎంఎఫ్ పేర్కొందని చెప్పారు. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయన్నారు. 361 బిలియన్ డాలర్ల విదేశఈ మారక ద్రవ్య నిలువలు ఉన్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉందని, భారత్ అన్ని రంగాల్లో ముందు ఉందన్నారు. ద్రవ్యోల్భణం అదుపులో ఉందన్నారు.

ఇప్పుడు అందరి చూపు భారత్ వైపు..

ఇప్పుడు అందరి చూపు భారత్ వైపు ఉందని చెప్పారు. ఇక రెండంకెల ద్రవ్యోల్భణం పాత మాట అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నారు.

ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం... నోట్ల రద్దు గర్వకారణం

ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు అని చెప్పారు. ప్రజా ధనానికి తాము ధర్మకర్తలమని చెప్పారు. 2017లో ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశముందని చెప్పారు. నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశానికి ఆర్థికంగా ఎంతో లబ్ధి అని చెప్పారు. ఈ రెండు తమకు గర్వకారణమని చెప్పారు.

నోట్ల రద్దుపై ప్రజలకు థ్యాంక్స్, నిరసనల మధ్య బడ్జెట్

ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారని జైట్లీ చెప్పారు. వసంత పంచమి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ సర్కారు పైన ఎన్నో ఆశలు ఉన్నాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్య జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

ద్రవ్యోల్భణం తగ్గిందన్నారు. నల్లధనం పైన తాము యుద్ధాన్ని ప్రకటించామని చెప్పారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన ఉండదని చెప్పారు. ప్రజా ధనానికి తాము ధర్మకర్తలమని చెప్పారు. పారదర్శకత తమ ధ్యేయమన్నారు. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించామన్నారు.

సమావేశాలు ప్రారంభం - అహమద్ మృతికి సంతాపం

- ప్రత్యేక పరిస్థితుల్లో సభను నిర్వహిస్తున్నామని స్పీకర్ చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బడ్జెట్ తప్పనిసరి అన్నారు.

- బడ్జెట్ కారణంగా సభను వాయిదా వేయలేకపోతున్నామని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో తెలిపారు. అహ్మద్ మృతికి సంతాపంగా రేపు (గురువారం) సభను వాయిదా వేస్తామన్నారు.

- తొలుత అహమద్ మృతికి సంతాపం తెలిపారు.

- పదకొండు గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

arun-jaitley-union-budget-2017-live-updates

పద్ధతి ఉంటుంది: వెంకయ్య

- పార్లమెంటుకు ఓ పద్ధతి ఉందని వెంకయ్య అన్నారు. అది రాజ్యాంగపరమైన బాధ్యత అన్నారు. గతంలో జరిగినట్లే స్పీకర్ నడుచుకుంటారని చెప్పారు.

- బడ్జెట్ పైన ఇప్పుడు కాంట్రోవర్సీ సరికాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

- బడ్జెట్‌ను వాయిదా వేయాలని తాము కోరలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.

- ఎంపీ అహమద్ మృతికి సంతాపం తెలిపిన అనంతరం జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

- కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించింది.

- బడ్జెట్‌ను ఈ రోజు ప్రవేశ పెడుతున్నామని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. బడ్జెట్ సమర్పణ ఆగదని చెప్పారు.

బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

- కేంద్ర కేబినెట్ సమావేశమయింది.

- బడ్జెట్ ఈ రోజు ప్రవేశ పెట్టడం సబబు కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

- బడ్జెట్‌ను వాయిదా వేయడం పెద్ద విషయం కాదని దేవేగౌడ అన్నారు. హడావుడి అవసరం లేదని ఆయన అన్నారు.

- నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చారు.

- ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య, జైట్లీ, అనంత్‌లు మృతి చెందిన అహ్మద్ నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు.

- కాసేపట్లో బీఏసీ భేటీ కానుంది. కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.

- బడ్జెట్‍‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ లోకసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.

-బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నారు. ఎంపీ అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే స్పీకర్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఓకే చెప్పారు. దీంతో మధ్యాహ్నం పదకొండు గంటలకు జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెడతారు. స్పీకర్ కార్యాలయం పార్టీ కార్యాలయాలకు తెలిపింది.

- 788 కాపీలను ముద్రించారు. సభ్యులకు ప్రతులు, బయటి వారికి డిజిటల్ ప్రతులు అందిస్తున్నారు.

బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి.

8.40 am: మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఫైనాన్స్ మినిస్ట్రీకి వచ్చారు.

8.36 am: బడ్డెట్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అహమద్ మృతి నేపథ్యంలో వాయిదా ఉండవచ్చునని అంటున్నారు.

8.35 am: ఎంపీ అహమద్ మృతి నేపథ్యంలో సభను వాయిదా వేసే అంశాన్ని స్పీకర్ నిర్ణయిస్తారని మంత్రి గాంగ్వార్ చెప్పారు.

8.30 am: మాజీ కేంద్రమంత్రి, ఎంపీ ఈ అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలనే విషయమై స్పీకర్ నిర్ణయించనున్నారు. వాయిదా వేస్తారా లేదా స్పీకర్ నిర్ణయిస్తారు.

arun-jaitley-union-budget-2017-live-updates

9.10: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ పత్రాలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. బడ్జెట్ ప్రవేశపెట్టాలా? వద్దా అనే విషయంపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

9.45: ఈరోజే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు స్పీకర్ కార్యాలయం.. పార్టీల నేతలకు తెలియజేసింది.

నోట్ల రద్దు కారణంగా వీచిన ఎదురుగాలులు, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న రక్షణాత్మక విధానాలను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను పదిలపరిచే చర్యలపై జైట్లీ దృష్టిసారించనున్నారు.

నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి పన్నుల రాయితీ రూపంలో సాంత్వన కలిగించడం, ఒడిదుడుకులకు గురైన ఆర్థిక రంగాన్ని ఉత్తేజ పరచడమే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించే అశకాశం ఉంది.

ఈసారి కేంద్ర బడ్జెట్ తయారీలో మహిళల ప్రాధాన్యత పెరిగింది. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 52 శాతాన్ని వారే రూపొందించడం విశేషం. కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Finance Minister Arun Jaitely will present Union Budget2017-18 in Lok Sabha. Get live updates on Budget 2017 in language, along with key highlights and announcements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more