క్రేజీ కేజ్రీవాల్: ఈడీ కస్టడీ నుండే ఆదేశాలు; ఆప్ మంత్రుల ప్రకటనలు; ఈడీ చర్యలు!!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే అరెస్టై ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుండి క్రేజీ పాలన సాగిస్తున్నారని తాజాగా ఆప్ మంత్రులు చేస్తున్న ప్రకటనలతో అర్ధం అవుతుంది.
లాకప్ నుంచి ఆయన పాలన సాగిస్తున్నట్టు ఆప్ మంత్రులు తాజాగా ప్రకటనలు విడుదల చేయడం ఇటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాకుండా, ఈడి అధికారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇటీవల ఢిల్లీలో నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి అతిషికి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు.

ఎటువంటి కాగితాలు, కంప్యూటర్లు సమకూర్చకుండానే అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా ఇచ్చారని, అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు బయటకు ఎలా అనేది తెలుసుకోవడానికి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మరోమారు నేడు లాకప్ నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండవ ఆదేశాలు జారీ చేసినట్టు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ వెల్లడించారు .
మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆయన కస్టడీలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు అంటూ ఆప్ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఈ వ్యవహారం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు.
అసలు నిజంగానే ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు ఇస్తున్నారా? లేక ఇదంతా కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారని తెలిసిన నేపథ్యంలో ముందుగానే ఆప్ మంత్రులు వేసుకున్న ప్లానా ? అన్న అనుమానాలు కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. ఈడి అధికారులు అరెస్టు చేయకముందే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ అరెస్టు చేస్తే ఆ తర్వాత ఏం చేయాలి అన్న దానిపైన ముందుగా ప్లాన్ వేసుకుని ఇలాంటి ప్రకటనలు చేస్తుందా అన్నది కూడా ప్రజల్లో చర్చకు వస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications