వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దండకారణ్యంలో అన్వేషణ: 15 మంది జవాన్లు మిస్సింగ్: ఎన్‌కౌంటర్ ప్రదేశానికి సీఆర్పీఎఫ్ బలగాలు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్‌ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 15 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలిపారు. బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో సుమారు మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఎదురు కాల్పుల్లో అయిదు మంది మావోయిస్టులు మరణించారు. మరో అయిదు మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున భారీ ఎన్‌కౌంటర్ చేసుకోవడం కలకలం రేపింది. బిజాపూర్, సుక్మా జిల్లాల్ల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దండకారణ్య పరిధిలోని పామెడు, తెర్రం, ఊసూరుల్లో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్ తరువాత 15 మంది జవాన్ల ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం దండకారణ్యంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2000 మందికి పైగా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గాలింపు కోసం హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకున్నారు.

At least 15 jawans are missing after encounter in Chhattisgarh

దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌‌లో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను హెలికాప్టర్ల ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. అదృశ్యమైన జవాన్ల కోసం బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ ఓపీ పల్ తెలిపారు. మొత్తం 15 మంది జాడ కనిపించట్లేదని ఆయన ధృవీకరించారు. ఈ మధ్యాహ్నానికి వారి ఆచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

English summary
At least 15 jawans are missing after Saturday’s encounter along the border between Bijapur and Sukma districts in Chhattisgarh, sources in Chhattisgarh Police said on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X