వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో క్యాష్: మూసివేత దిశగా ఎటీఎంలు.. వేల కుటుంబాల జీవితం చిద్రం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గతేడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నల్లధనం వెలికితీత, అవినీతిని అరికట్టే లక్ష్యంతో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో మొదలైన ఏటీఎం కష్టాలు 'అంతం కాదిది ఆరంభంలా' కొనసాగుతున్నాయి. గత నెల 13వ తేదీ వరకూ నగదు తీసుకోవడంలో ఉన్న నిబంధనలు వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తర్వాత ఎంత మొత్తమైనా బ్యాంకుల నుంచి, ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చునని ఆర్‌బీఐ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఏటీఎంలలో డబ్బులు లేకపోవడానికి కారణం అవుతోందని బ్యాంకర్లు వాపోతున్నారు. గతంలో వరుస సెలవులు వస్తే ఏటీఎంలలో డబ్బులు నింపరని భావించే వారు. ఇప్పుడు ఎప్పుడూ డబ్బులు ఉండడంలేదని రుజువైంది.

హైదరాబాద్‌ ఎటీఎంల్లో 83% నో క్యాష్
హైదరాబాద్ పరిధిలో వివిధ బ్యాంకుల శాఖలు 1150 కాగా, 2150 ఎటిఎం సెంటర్లు పనిచేస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో 788 బ్యాంకుల శాఖల పరిధిలో 1370 ఎటిఎం సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 83 శాతం ఏటీఎంలలో నగదు ఉండడంలేదని నగర పౌరుల వేదిక వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇటువంటి ఏటీఎంల నిర్వహణ భారమని ఈ పరిస్థితుల్లో అద్దె కాలం పూర్తయితే నగరంలోని చాలా వరకూ ఏటీఎంలు ఖాళీ అవుతాయని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలనీల్లో ఏర్పాటు చేసిన ఏటీఎంలను తొలగించి ఆయా షాపులను ఖాళీ చేసేశారు.

ఏటీఎం సేవలు బ్యాంకు శాఖలకే పరిమితం
గతంలో ఎటీఎం కార్డు ఉంటే.. పైసలు జేబులో ఉన్నట్లేననే భావనలో ఉండేవారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్లాస్టిక్‌ కార్డుతో ఆన్‌లైన్‌ చెల్లింపులే తప్ప నగదు తీసుకొని జేబులో పెట్టుకునేందుకు అవకాశం లేని పరిస్థితి. దీంతో గతంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఎత్తివేసేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. మూడు షిప్టుల్లో భద్రతాగార్డులను ఉంచాలంటే.. ఒక్కో ఏటీఎంకు రూ. 30 వేల వరకూ ఖర్చు వస్తున్నది. ఏటీఎం అద్దెలు, కరెంటు బిల్లులు ఇలా ఒక్కో ఏటీఎం నిర్వహణకు దాదాపు రూ. 60 నుంచి 70 వేల వరకూ ఖర్చులు అవుతున్నాయి. ఏటీఎంలలో వేరే కార్డుతో డబ్బులు తీసినప్పుడు ఆయా బ్యాంకులకు సేవాపన్ను వెళ్లేది. ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు నింపడానికి నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఆయా బ్యాంకులు పెట్టిన ఏటీఎంలను తొలగించి.. సొంత బ్యాంకు శాఖల్లోనే వాటిని అందుబాటులో ఉంచుతున్నారు.

 ATM's are running with 'no' cash

గతంలో రోజూ 17.98 లక్షల కోట్ల లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దుకు ముందు ప్రతి రోజూ రూ.17.98 లక్షల కోట్ల మేరకు బ్యాంకుల్లో లావాదేవీలు జరిగేవి. పెద్ద నోట్ల రద్దుతో.. బ్యాంకులు పెట్టిన పలు నిబంధనలతో బ్యాంకుల్లో జమ అవుతున్న మొత్తాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇలా గత నెలాఖరు నాటికి రూ.13.35 లక్షల కోట్లకు బ్యాంకు లావాదేవీలు పడిపోయాయి. 86 % నోట్లు రద్దు అవ్వడంతో ఆ మేరకు ముద్రణ కూడా జరగలేదు. రద్దయిన మొత్తం నోట్లతో పోలిస్తే 65% ముద్రించారు. రూ. 15 లక్షల కోట్లు రద్దయితే.. అందులో రూ. 10 లక్షల కోట్లు మాత్రమే ముద్రించాని అఖిల భారత బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు రాంబాబు చెప్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో డబ్బులు తీయాలన్నా.. వేయాలన్నా.. ఛార్జిల భారం వినియోగదారుడిపై పడుతుండడంతో తరచూ బ్యాంకుతో పని లేకుండా, నగదు నిల్వలు సొంతంగా ఉంచుకోవడంతో నగదు బ్యాంకులకు రావడంలేదు. ఇదే ఏటీఎంల ఖాళీకి కారణమవుతోందని బ్యాంకు ప్రతినిధులు చెబుతున్నారు.

చెక్కు ఇచ్చినా నో మనీ
చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకోడానికి కూడా అవకాశాలు లేవు. ఎంత డబ్బునైనా నగదు తీసుకోవచ్చుననే నిబంధననూ బ్యాంకులు ఆచరించలేకపోతున్నాయి. రూ. 2 కాదు 3 లక్షలు అయినా చెక్కు మీద ఇచ్చేయండి.. ఆదాయ పన్ను వాళ్లకు వాళ్లే లెక్కలు చూపుతారని ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు వచ్చినా.. అంత డబ్బు ఇవ్వడానికి బ్యాంకుల్లో నిల్వలు ఉండడంలేదు.

ఖాతాదారులందరికి సర్దుబాటుకు యత్నం
బ్యాంకుల మేనేజర్లు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను చూసుకొని ఇస్తున్నారు. సొంత ఖాతాదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత ఇచ్చి సరిపెట్టాలనే ఉద్దేశంతో బ్యాంకులు పని చేస్తున్నాయి. బ్యాంకుల ప్రతి సేవకు డబ్బులు చెల్లించాల్సి వస్తుండడంతో వినియోగదారుడు బ్యాంకులో ఉన్న మొత్తం సొమ్ము ఒకేసారి తీసేయాలని చూస్తుండడం కూడా ఇబ్బందిగా మారిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.పెద్ద నోట్లు రద్దయిన మేరకు కొత్త నోట్ల ముద్రణ జరగలేదు. కేవలం 65 శాతం ముద్రిస్తే.. ఆ వచ్చిన కొత్త నోట్లు కూడా ఖాతాదారులు బ్యాంకుల్లో ఉంచకుండా ఇళ్లలో భద్రపరుస్తున్నారు. ఇది కూడా ఇబ్బందిగా మారిందని బ్యాంకు మేనేజర్లు వాపోతున్నారు.

ఎటీఎంల మూతతో నిర్వహణ సంస్థల నష్టం రూ.600 కోట్లు
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ పనిచేయని 25 శాతం ఏటీఎంలు వాటి మూతతో ఏటీఎం నిర్వహణ సంస్థల నష్టం రూ.600 కోట్లు నగదు సరఫరా చేసే క్యాష్‌ లాజిస్టిక్‌ సంస్థల నష్టం రూ.170 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఏటీఎంల తయారీ, వాటితో ముడిపడి ఉన్న సంస్థలన్నీ నష్టాల్లో కూరుకున్నాయి. చివరికి సెక్యూరిటీ గార్డులను అందించే ఏజెన్సీలపైనా ప్రభావం ఏటీఎంల ముందు ఉండే సెక్యూరిటీ గార్డుల వేతనాల్లో కోత నగదు కొరతలో వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు.. క్యాష్‌ లాజిస్టిక్‌ సంస్థల మూసివేత వల్ల ఈ ఏటీఎం ఆర్థిక వ్యవస్థ డిజిటల్‌ వైపు మళ్లడం ప్రశ్నార్థకమేనని నిపుణులు అంటున్నారు.

ఎటీఎంల పనిచేయక వేల జీవితాలు చిధ్రం
నగదు రహిత లావాదేవీలతో డిజిటల్‌ వైపు మళ్లితే.. జవాబుదారీతనం పెరుగుతుందని, పన్నుల వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదంతా నోటుకు ఒకవైపు మాత్రమే. అదే మరోవైపు చూస్తే.. దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలు పనిచేయకుంటే సామాన్యుల జీతాలు చేతికి రావు. ఏటీఎంల చుట్టూ అల్లుకున్న కొన్ని వేల జీవితాలు కూడా ఛిద్రమైపోతున్నాయ్‌. ఏటీఎంల చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థ కొన్ని వేల కోట్లు నష్టపోతోంది. ఆ వ్యవస్థపై ఆధారపడ్డ చిన్నాపెద్దా ఉద్యోగులంతా దిక్కులు చూస్తున్నారు.

English summary
ATM's of Banks are running with 'no' cash. From the begining of notesban general people suffering with cash crunch. Today created problem leads to thosands of families into crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X