టోల్ ప్లాజా ప్రయాణికులకు NHAI అలర్ట్...! ఇక అవేం చెల్లవు..!
దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న టోల్ ప్లాజాల ద్వారా ప్రయాణాలు చేసే వాహనదారులకు ఇవాళ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (NHAI) కీలక సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మధ్య టోల్ ప్లాజాల వద్ద పెరుగుతున్న వివాదాలు, అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈ అడ్వైజరీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో రహదారుల ప్రాధికారిక సంస్థ 2008 నాటి టోల్ ప్లాజాల రూల్స్ ను మరోసారి గుర్తుచేసింది.
జాతీయ రహదారులపై టోల్ మినహాయింపులు, డిస్కౌంట్లు జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు వసూలు నిర్ణయం) నియమాలు, 2008 ఆధారంగా నిర్వహిస్తున్నట్లు NHAI తెలిపింది. ఇందులో రూల్ 11 ప్రకారం వినియోగదారు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు నిర్దిష్ట వర్గాల వాహనాలు, వ్యక్తులకు, నిర్దేశించిన షరతులకు లోబడి వర్తిస్తుందని తెలిపింది.
అలాగే రూల 9 టోల్ ప్లాజా నుండి 20 కి.మీ.దూరంలో నివసించే స్థానిక వాణిజ్యేతర వాహన వినియోగదారులకు నెలవారీ పాస్‌లు (సర్వీస్ రోడ్ లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో లేని చోట), అర్హత ప్రకారం తగ్గిన ధరలకు జిల్లా స్థాయి రాయితీలతో సహా డిస్కౌంట్ పాస్‌లను అందిస్తుందని వెల్లడించింది.

Attention National Highway Users!
— NHAI (@NHAI_Official) January 19, 2026
NHAI would like to inform that toll exemptions and discounts on National Highways are governed by the National Highways Fee (Determination of Rates and Collection) Rules, 2008.
As per Rule 11, exemption from payment of user fee is applicable to… pic.twitter.com/NKEDqahD0x
అలాగే అన్ని జాతీయ రహదారి వినియోగదారులు నోటిఫైడ్ నియమాలను పాటించాలని, అర్హత ఉంటేనే మినహాయింపులు లేదా డిస్కౌంట్‌లను పొందాలని కోరింది. అందరికీ సజావుగా, పారదర్శకంగా, ఇబ్బంది లేని ప్రయాణాన్ని ఇచ్చేందుకు టోల్ ఆపరేటర్లతో సహకరించాలని వాహనదారులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కోరుతోంది. దీంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ఎవరెవరికి ఫీజు మినహాయింపులు ఉన్నాయో తెలియజేసే పత్రాల్ని కూడా ఎక్స్ లో ట్వీట్ చేసింది. వీరికి మాత్రమే మినహాయింపులు, రాయితీలు వర్తిస్తాయని తెలిపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications