
Viral Video:వావ్.. బీటెక్ గ్రాడ్యుయేట్ టీ స్టాల్, మసాలా, లెమన్ టీ స్పెషల్
కొందరు చదివేది ఒకటి, చేసేది మరొకటి ఉంటుంది. అదే ప్రొఫెషన్.. ఇప్పుడు క్రియేటివిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకోసమే.. ప్రొఫెషనల్ కోర్సు చేస్తోన్నా.. సరే.. తిరిగి మరో ప్రొఫెషన్ లోకి వస్తున్నారు. ఇంజినీరింగ్ చఏసి.. బిర్యానీ సెంటర్, టీ స్టాల్ పెట్టుకుంటున్నారు. మన హైదరాబాద్ లో కూడా అలాంటి సెంటర్లు చాలనే ఉన్నాయి. కానీ బీహర్ లో ఓ మహిళ మాత్రం ముందడుగు వేసింది. మీరే చూడండి.

కల సాకారం..
వర్తికా సింగ్ అనే యువతి బిటెక్ చేసింది. కానీ ఆమె కల మాత్రం టీ స్టాల్ పెట్టుకోవడమే.. అవును బీటెక్ పూర్తి చేసి.. జాబ్ కోసం ఎదురు చూసేంత ఓపిక ఆమెకు లేదు. చదువుతూనే.. తన స్టార్టప్ పెట్టుకుంది. తన కలను సాకారం చేసుకుంది. దానికి బీటెక్ చాయ్ వాలీ అని పేరు పెట్టింది. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.

ఇవీ స్పెషల్
స్వాగ్ సే డాక్టర్ పేరుతో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీ స్టాల్ గురించి తెలిపారు. ఫరీదాబాద్ లో గల గ్రీన్ ఫీల్డ్ వద్ద టీ స్టాల్ ఏర్పాటు చేశారు. టీ స్టాల్ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని వివరించారు. తన వద్ద టీ విభిన్నంగా ఉంటుందని తెలిపారు. మాసాలా అండ్ లెమన్ టీ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. రెగ్యులర్ టీ రూ.10 అని.. స్పెషల్ టీ రూ.20కి విక్రయిస్తున్నానని వివరించింది.

56 వేల వ్యూస్
చిన్న స్టౌవ్ పెట్టుకొని, అల్యూమినియం కేటిల్ పట్టుకొని టీ విక్రయిస్తోంది. ఆమె చుట్టూ చాలా మంది చేరి.. టీ కావాలని అడుగుతున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 56 వేల సార్లు చూశారు. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీ నవ్వు, కాన్పిడెన్స్ తమకు నచ్చిందని ఒకరు రాశారు. మీకు మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మీరు అలాగే కొనసాగాలని.. వచ్చే ఏడాదిలో బ్రాండ్ గా మారతారని తెలియజేశారు.
మరొకరు.. ఆదర్శం అట..
మీరు చేస్తోన్న పని వల్ల మరింత గౌరవం లభించనుందని వివరించారు. ఇదివరకు పాట్నాలో కూడా ఎకనామిక్ గ్రాడ్యుయేల్ టీ స్టాల్ పెట్టారు. జాబ్ రాకపోవడంతో.. టీ స్టాల్ పెట్టిసింది. తాను ప్రఫుల్ బిల్లొర్ ను ఆదర్శంగా చూసుకొని.. టీ స్టాల్ ఏర్పాటు చేశానని వివరించారు.