వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీబీఏ విద్యార్థి గదిలో 160 నకిలీ పాస్‌పోర్టులు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: బీబీఏ విద్యాభ్యాసం చేస్తున్న ఓ విద్యార్థి అక్రమ మార్గంలో ఏకంగా 160 నకిలి పాస్ పోర్టులు సంపాధించి పోలీసులకు చిక్కిపోయాడు. అతని దగ్గర అన్ని నకిలి పాస్ పోర్టులు ఏలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

బీహార్ లోని గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మధుర సీనియర్ ఎస్పీ రాకేస్ సింగ్ చెప్పారు. రాకేష్ సింగ్ బీబీఏ విద్యార్థి వికాస్ కుమార్ వివరాలు వెల్లడించారు.

ఆగ్రాలోని ఓ ప్రయివేటు కాలేజ్ లో వికాస్ కుమార్ బీబీఏ ప్రథమ సంవత్సరంలో చేరాడు. అతనికి కాలేజ్ లోని హాస్టల్ లో ఓగది కేటాయించారు. వికాస్ కుమార్ ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో హాస్టల్ గది నుంచి అతన్ని ఖాళీ చేయించారు.

తరువాత అతను అద్దె గది తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. వికాస్ కుమార్ ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. రోజు మార్చి రోజు గదికి తాళం వేసి వెళ్లిపోతున్నాడు. ఇంటి యజమానులతో మాట్లాడకుండా తప్పించుకుని తిరిగేవాడు.

BBA Student caught with 160 fake passports in Agra

ఇంటి యజమానులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వికాస్ కుమార్ గదికి చేరుకుని పరిశీలించారు. అంతే పోలీసుల దిమ్మె తిరిగింది. అతని గదిలో భారత్, అరబ్ దేశాలకు చెందిన 160 నకిలి పాస్ పోర్టులు బయటపడ్డాయి.

పాస్ పోర్టులతో పాటు వీసా అప్లికేషన్లు, ఉద్యోగ పత్రాలు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వికాస్ గతంలో ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అరబ్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నకిలి పాస్ పోర్టులు, వీసాలు, ఇతర పత్రాలు సృష్టించి వారి దగ్గర భారీ మొత్తంలో నగదు వసూలు చేశాడని విచారణలో వెలుగు చూసిందని సీనియర్ ఎస్పీ రాకేష్ సింగ్ తెలిపారు.

English summary
A first-year undergraduate student of business administration has been arrested with 160 fake passports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X