ఆంటీ వేధింపులు తట్టుకోలేక కుర్రాడు సూసైడ్.. ఏం జరిగిందంటే..?
42 ఏళ్ల ఆంటీ వేధింపులకు తట్టుకోలేక 27 ఏళ్ల కుర్రాడు మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. వివాహిత నుంచి వచ్చిన వేధింపుల కారణంగానే అతడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు దిలీప్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఓ జిమ్ ట్రైనర్ అని తేలింది. ఈ ఘటన శనివారం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివాహిత దిలీప్ సోదరికి ఓ మెసేజ్ పెట్టడంతో హుటాహుటిన ఆ కుటుంబ సభ్యులు దిలీప్ ఉంటున్న రూమ్ కు చేరుకున్నారు. అప్పటికే డోర్ లోపలి నుంచి లాక్ చేశాడు దిలీప్. రూమ్ లోపల సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ ఓ జిమ్ ట్రైనర్. అయితే అదే జిమ్ లో రెండేళ్ల క్రితం ఆ వివాహిత ఫిట్ నెస్ కోసం జాయిన్ అయింది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ దిలీప్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమెను అన్ ఫ్రెండ్ చేశాడు. అయితే చనిపోయే రోజు మాత్రం ఆ మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని ఆ మహిళ వెంటనే దిలీప్ సోదరికి చెప్పడంతో వాళ్లు దిలీప్ రూమ్ కు వెళ్లి చూసే సరికి అప్పటికే దిలీప్ సూసైడ్ చేసుకున్నాడు.

ఇక ఇదే విషయంపై దిలీప్ ఫ్యామిలీ ఆ మహిళపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ మహిళ దిలీప్ ను డబ్బు, ప్రాపర్టీ కావాలని బ్లాక్ మెయిల్ చేసిందని చెబుతున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం బహిర్గతం అయిందని పోలీసుల సమక్షంలో ఆ మహిళ భర్త, దిలీప్ మధ్య సంవత్సరం క్రితం రాజీ కుదిరిందని అన్నారు. కానీ అప్పటి నుంచి తమ కుమారుడ్ని బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని దిలీప్ తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమారుడి చావుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నేలమంగళ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications