ప్రియుడి ఫోన్లో తనతో పాటు 13 వేల నగ్న ఫొటోలు-బెంగళూరులో యువతికి షాక్...
బెంగళూరులో తాజాగా ఓ ఘోరం చోటు చేసుకుంది. నాలుగునెలలుగా తనతో పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ప్రియుడు ఆమెన వాడుకోవడమే కాకుండా తన నగ్న ఫొటోల్ని తీశాడు. ఇలా తనతో పాటు తన తోటి మహిళా ఉద్యోగుల ఫొటోలు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ కలిసి 13 వేల ఫొటోల వరకూ ఉన్నాయి. వీటిని ప్రియుడి ఫోన్లో చూసిన ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని ఓ బీపీఓ సంస్ధలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతికి ఓ ప్రియుడు ఉన్నాడు. వీరిద్దరూ గత నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో బాగా దగ్గరయ్యారు కూడా. ఆమె ఈ సమయంలో ప్రియుడితో చాలా సన్నిహితంగా మెలిగింది. అలా నాలుగు నెలలు రిలేషన్ షిప్ కొనసాగించిన తర్వాత ఓ రోజు ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అనుకోకుండా ఓసారి ప్రియుడి సెల్ ఫోన్ తీసుకుని గ్యాలరీ తెరిచింది. ఇక అంతే సంగతులు..

ప్రియుడి సెల్ ఫోన్ గ్యాలరీలో ఏకంగా 13 వేల నగ్న ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇందులో తనతో పాటు తనతో పాటు అదే సంస్ధలో పనిచేస్తున్న ఇతర మహిళ ఉద్యోగుల నగ్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడగానే ఆమె అవాక్కయింది. తనతో పాటు కలిసి ఉంటూ ప్రియుడు ఈ ఫొటోలు తీసినట్లు గుర్తించింది. అంతే ఒళ్లు మండిపోయి అతనితో రిలేషన్ షిప్ ను తెగతెంపులు చేసేసుకుంది. అంతే కాదు ఆ మిగతా న్యూడ్ ఫొటోల్లో ఉన్న ఉద్యోగుల్ని కూడా అలర్ట్ చేసింది.
చివరికి ఈ విషయం బీపీవో పెద్దలకు కూడా తెలిసింది. దీంతో వారు బెంగళూరు సైబర్ క్రైమ్ పీఎస్ లో కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కీచకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.












Click it and Unblock the Notifications