మహిళ ఎమ్మెల్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీజెపి ఎమ్మెల్సీ, పార్టీలో చోటు మిస్

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహర్ బీజెపి ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ లాల్ బాబు ప్రసాద్ , అదే పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్సీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తోటి ఎమ్మెల్సీల ఎదుటే మహిళ ఎమ్మెల్సీ భర్త లాల్ బాబు ప్రసాద్ పై దాడికి దిగాడు.

ఛతాపూర్ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ అలియాస్ బబ్లూ భార్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రసాద్ తనను అభ్యంతరకరంగా తాకాడని మహిళా ఎమ్మెల్సీ తన భర్త నీరజ్ కు చెప్పారు. మండలికి వచ్చే దారిలో ప్రసాద్ అనుచితంగా ప్రవర్తంచిన విషయాన్ని ఆమె చెప్పారు.

bihar bjp drops its vice-chief after mla slaps him for touching his mlc wife

దీంతో నీరజ్ ఇతర ఎమ్మెల్సీల సమక్షంలోనే ప్రసాద్ తో గొడవ పడి చెంప పగులగొట్టాడు. ఈ విషయ బీజెపి పెద్దల దృష్టికి రావడంతో ప్రసాద్ పై చర్యలు తీసుకొన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలో కూడ ప్రసాద్ కు స్థానం కల్పించలేదని పార్టీ సీనియర్ నాయకులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు.

మహిళ ఎమ్మెల్సీ నుండి తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని, ఈ ఘటన గురించి విన్న తర్వాత పార్టీ నాయకులతో చర్చించి , కొత్త కమిటీలో ప్రసాద్ కు స్థానం కల్పించకూడదని నిర్ణయించినట్టుగా రాయ్ చెప్పాడు.

గత కమిటీలో ఆయన కోశాధికారిగా ఉన్నారు.ఎమ్మెల్సీ ప్రసాద్ వ్యవహరంపై నీరజ్ భార్య మండలి చైర్ పర్సన్ కు కానీ, బీజెపి అధ్యక్షుడికి కాని ఫిర్యాదు చేయలేదు. అయితే ఇది చిన్న సమస్య అని, దీన్ని తాము పరిష్కరించుకొన్నామని నీరజ్ చెప్పారు.ఈ ఘటనపై మాట్లాడేందుకుగాను ప్రసాద్ నిరాకరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bihar bjp vice-president and mlc lalbabu Prasad was dropped from a newly constituted party committee thursday, a day after he was slapped by a bjp mla whose wife complained that Prasad had touched her “inappropriately”
Please Wait while comments are loading...