వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి చేష్టలతో బిరియానీ సిటీ కాస్త... ఉగ్రవాద సిటీ అయింది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఒకప్పుడు బిర్యానీ టౌన్‌గా వెలుగొందిన కర్ణాటకలోని భత్కల్ ఇప్పుడు టెర్రిరిస్టుల సిటీగా పేరుగాంచింది. బెంగుళూరు పోలీసులు, ఎన్ఐఏ, ఇంటిలిజెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలు సమీకరించి ఉగ్రదాడులకు రూపకల్పన చేస్తున్న ముగ్గురు ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు సిటి కమిషనర్ ఎమ్ఎన్. రెడ్డి తెలిపారు.

ఈ ముగ్గురిలో ఇద్దరిని కర్ణాటకలోని చిక్ మగుళూరు జిల్లాలోని భత్కల్‌ పట్టణంలో అదుపులోకి తీసుకోగా, ఒకడిని కాక్స్ టౌన్, బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కూడా కర్ణాటక రాష్ట్రంలోని భత్కల్ పట్టణానికి చెందిన వారు కావడం విశేషం.

సయ్యద్ ఇస్మాయిల్ ఆఫక్ (34), సద్దాం హుస్సేన్ (35)తో పాటు అబ్దుల్ సుబుర్ అనే 24ఏళ్ల ఎమ్‌బీఏ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి నైట్రేట్, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ టైమర్లు, పీవీసీ పైపులు, ద్రవ ఇంధనం, డిజిటల్ సర్క్యూట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

 Biriyani to Afghanistan- The transition of Bhatkal

ఈ ముగ్గురు కూడా భత్కల్ పట్టణానికి చెందిన మరో బయట వ్యక్తి సుల్తాన్ ఆర్మర్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని నివేదిస్తున్నారని కమిషనర్ రెడ్డి తెలిపారు. ఇక సుల్తాన్ ఆర్మర్ విషయానికి వస్తే ఇండియన్ ముజాయిద్దీన్, తెహ్రీక్ ఈ తాలిబన్, ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్ధ అన్సార్-ఉల్-తావిద్ లాంటి సంస్ధలతో కలిసి పనిచేస్తూ, అమాయక ప్రజలను వాటిలో చేర్పిస్తుంటాడు.

భత్కల్ నుంచి ఆఫ్ఘనిస్ధాన్:

ఇటీవల కాలంలో భారత్‌లో బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, యాసిన్ భత్కల్ ఈ పట్టణానికి చెందిన వారే. ఆఘ్గనిస్ధాన్‌ దాడుల్లో అన్వర్ భత్కల్ మరణించాడు. రియాజ్ భత్కల్‌కు బంధువైన అన్వర్ భత్కల్ 2008లో కరాచీలో ఓ ఉగ్రవాద సంస్ధలో సుల్తాన్ ఆర్మర్ చేర్పించాడు.

 Biriyani to Afghanistan- The transition of Bhatkal

38 ఏళ్ల అన్వర్ భత్కల్ దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, అతన్ని సుల్తాన్ ఆర్మర్ తొలుత ఇండియన్ ముజాయిద్దీన్ చేర్పించి, ఆ తర్వాత 2013లో ఆఘ్గనిస్ధాన్‌కు చెందిన అన్సార్-ఉల్-తావిధ్ సంస్ధలో చేర్పించినట్లు ఎన్ఐఏ నివేదికలో పేర్కొంది.

2013 వరకు ఫోన్‌లో సంభాషణలు కొనసాగించినట్లు అన్వర్ భత్కల్ తన కుటుంబ సభ్యులతో మాట్లినట్లు వారు వన్‌ఇండియాకు తెలిపారు. ఐతే అన్వర్ భత్కల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని కూడా వారు చెప్పారు.

రియాజ్ భత్కల్:

డాక్టర్. చిత్తరంజన్ మర్డర్ కేసులో తొలిసారిగా రియాజ్ భత్కల్ వెలుగులోకి వచ్చింది. రియాజ్ భత్కల్ ప్రపంచ ఉగ్రవాదంలోకి అడుగుపెట్టడానికి కారణం ఐడియాలజీ కాదని కేవలం డబ్బుకోసమే వారు ఈ వృత్తిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఇండియన్ ముజాయిద్దీన్‌ను పెంచి పోషించేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఐఎస్ఐ నుంచి వచ్చేదని విచారణలో వెల్లడైంది.

భారత్‌లో ఇండియన్ ముజాయిద్దీన్ పుట్టడానికి కారణం రియాజ్ భత్కల్, అతని తమ్ముడు ఇక్బాల్ భత్కల్. దేశంలో వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్‌ను వీరే రిక్రూట్ చేసుకున్నారు.

 Biriyani to Afghanistan- The transition of Bhatkal

20 సంవత్సరాల క్రితం ప్లేట్ బిర్యానీ లేదా దిగుమతైన వాక్‌మెన్ కొనాలనుకునే వారికి భత్కల్ పట్టణంలో తప్పక దొరుకుతుంది. స్మగుల్ గూడ్స్‌కు చెందిన అన్ని వస్తువులు తప్పక లభించే పట్టణం భత్కల్. అలాంటి పట్టణం ఇప్పడు టెర్రిరిస్టుల హాబ్‌గా మారింది.

ఐతే అక్కడి స్ధానికులు మాత్రం ఎవరో ముగ్గరు లేదా నలుగురు వ్యక్తులు ఉగ్రవాద సంస్ధల్లో చేరినంత మాత్రాన సిటిలో నివసించే అందరినీ ఉగ్రవాదులనడం, సిటీనే టెర్రరిస్టుల హాబ్ అనడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్నారు.

 Biriyani to Afghanistan- The transition of Bhatkal

ఇంకొక స్ధానికుడు భత్కల్‌ను ఇంటి పేరుగా వాడుకొని సిటీ మొత్తానికి చెడ్డపేరు తెచ్చారని వాపోయాడు. నిజం చెప్పాలంటే రియాజ్ ఇంటి పేరు షబనాద్రి, యాసిన్ ఇంటి పేరు సిద్దిబాప్ప. భత్కల్‌ను ఇంటి పేరుగా పెట్టుకుని సిటీ మొత్తానికి మచ్చ తెచ్చారని అన్నాడు.

ఒకప్పుడు బిర్యానీ సిటీ వెలుగొందిన భత్కల్ పట్టణాన్ని ఈ నలుగురు లేదా ఐదుగురు టెర్రరిస్టుల సిటీగా మార్చారని స్ధానికులు వారి ఆవేదనను వెలిబుచ్చారు. దేశంలో ఏ ఉగ్రవాద దాడులు జరిగిన ఇంటిలిజెన్స్ అధికారులు తమవైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

English summary
Three arrests and once again a connection with Bhatkal, the coastal town of Karnataka. A place once known for its exquisite biriyani has earned the terror tag and spare a thought for many innocent residents of the area who say thanks to some black sheep everyone is being classified as a terrorist here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X