వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు ప్రాంతీయ పార్టీల‌ను క‌బ‌ళించ‌బోతున్న బీజేపీ?

|
Google Oneindia TeluguNews

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా అవి లోక్‌స‌భ‌కే జ‌రుగుతున్నాయ‌న్నంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, హోం మంత్రి అమిత్ షా ఎటువంటి అల‌స‌త్వానికి తావివ్వ‌కుండా రాజ‌కీయంగా అవ‌కాశం ఉన్న ప్ర‌తి సంద‌ర్భంలోను ఎత్తులు వేస్తూ విజ‌యానికి చేరువ కావ‌డానికి చూస్తున్నారు. తాజాగా వీరి దృష్టి క‌ర్ణాట‌క‌లోని జేడీఎస్‌, ఒడిసాలోని బిజూ జ‌న‌తాద‌ళ్‌పై ప‌డింది.

త్వరలోనే కర్ణాటక ఎన్నికలు

త్వరలోనే కర్ణాటక ఎన్నికలు


2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-జేడీఎస్ స‌ర్కారు కొలువు తీరింది. అంత‌కుముందు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించ‌డంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అనంత‌ర ప‌రిణామాల్లో య‌డ్యూర‌ప్ప 55 గంట‌ల‌పాటు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగి బ‌లం నిరూపించుకోవ‌డం అసాధ్య‌మ‌ని తేల‌డంతో ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక్క‌డ కూడా రెబెల్ ఎమ్మెల్యేలు పుట్టుకొచ్చారు. వారి తిరుగుబాటుతో కాంగ్రెస్‌-జేడీఎస్ స‌ర్కారు సంకీర్ణంలో ప‌డి బ‌లం నిరూపించుకోలేకపోయింది. య‌థావిధిగానే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర త‌ర‌హాలో ఇక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం కొలువుతీరింది. ప్ర‌స్తుతం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్నాయి.

మైసూరుపై పట్టు దొరికితే.. కర్ణాటక చిక్కినట్లే..

మైసూరుపై పట్టు దొరికితే.. కర్ణాటక చిక్కినట్లే..


మైసూరుతోపాటు ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో జేడీఎస్‌కు గ‌ట్టి ప‌ట్టుంది. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా బీజేపీ ఇక్క‌డ మాత్రం త‌న ప‌ట్టును నిరూపించుకోలేక‌పోతోంది. మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవ‌గౌడ్ కుమారుడు కుమార‌స్వామి పార్టీ అధినేత‌గా కొన‌సాగుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకోవాలంటే కాంగ్రెస్ క‌న్నా జేడీఎస్ ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంది. అందుక‌నుగుణంగా ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌ను, స్థానికంగా ప‌ట్టున్న నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఈసారి అధికారం ఖాయం

ఈసారి అధికారం ఖాయం


ఒడిషాలో కాంగ్రెస్ ను బ‌ల‌హీనం చేసి రెండోస్థానానికి ఎగ‌బాకిన బీజేపీకి ఇక్క‌డ అధికారం మాత్రం క‌ల‌గానే మిగిలిపోతోంది. బిజూ జ‌న‌తాద‌ళ్ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ నిజాయితీగా చేసే ప‌రిపాల‌న‌, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు పార‌ద‌ర్శ‌కంగా ఉండ‌టం బీజేపీకి ఇబ్బందిక‌రంగా మారుతోంది. వాల్తేర్ డివిజ‌న్ ను విడ‌దీసి భువ‌నేశ్వ‌ర్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేసే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో క‌ల‌ప‌డం, ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంతోపాటు కేంద్రంలోని ఇత‌ర మంత్రిత్వ శాఖ‌ల్లో ఒడిషాకు చెందిన ముఖ్య‌మైన అధికారులే ఉండ‌టంతో ఆ రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను బీజేపీ బేరీజు వేసుకుంటోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఒడిషాకు కూడా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈలోగా ఇక్క‌డ బ‌లోపేతం కావ‌డానికి ప‌రిణామాల‌న్నీ బేరీజు వేసుకొని రానున్న ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేడీ-బీజేపీ మ‌ధ్య అంత‌రం ఎక్కువ‌గా ఉంది. పొత్తును వ‌ద్ద‌నుకొని ఒంట‌రిగా పోటీకి దిగిన బీజేపీ 146 సీట్ల‌లో పోటీచేసి 23 సీట్ల‌నే కైవ‌సం చేసుకోగ‌లిగింది. కానీ ఈసారి ఎన్నిక‌ల్లో మాత్రం విజ‌యం త‌మ‌దేన‌ని, ఒడిషాలో పాగా వేస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

English summary
bjp focus is on JDS in Karnataka and Biju Janata Dal in Odisha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X