Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కేరళ ఓ సిటీ': శ్రీశాంత్‌పై దుమ్మెత్తిపోశారు, థరూర్ కూడా

తిరువనంతపురం: భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన కేరళను రాష్ట్రంగా కాకుండా.. ఓ నగరంగా పేర్కొన్నారు. దీంతో అతని పైన కొందరు దుమ్మెత్తిపోశారు.

శ్రీశాంత్ కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరారు. ఆయన ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నారు. శ్రీశాంత్ నిత్యం ట్విట్టర్, పేస్‌బుక్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో యాక్టివ్‌గా ఉంటారు.

ఎన్నికల నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో.. బిజెపి గెలిస్తే కేరళ నగరాన్ని ప్రపంచ బెస్ట్ నగరంగా చేస్తామని పేర్కొన్నారు. మనమంతా కలిసి పని చేస్తే కేరళ నగరం ప్రపంచంలోనే అత్యుత్తమ సిటీ అవుతుందని చెప్పారు.

BJP star candidate Sreesanth says Kerala a city, gets trolled

దీనిపై కేరళీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ నగరం కాదని, రాష్ట్రమని గుర్తుంచుకోవాలని ఒకరు ట్వీట్ చేశారు. కేరళ నగరం అయితే, నీ దృష్టిలో భారత్ ఓ రాష్ట్రమా అని మరొకరు ట్వీట్ చేశారు. మీక తరఫున ఎవరైతే రాస్తున్నారో.. వారిని మార్చాలని ఇంకొందరు సూచించారు.

'ఓ మై గాడ్.. కేరళ నగరం కాదు. నీకు జనరల్ నాలెడ్జ్ లెస్సన్స్ అవసరం. నీకు భౌగోళిక అంశాలు మొదట తెలుసుకో. ఆ తర్వాత రాజకీయాల వైపు చూడు' అని ఒకరు ట్వీట్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత శశిథరూర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదిగేందుకు శ్రీశాంత్ కొన్ని పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు కొంత హోం వర్క్ చేయాల్సి ఉండెనన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+