స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.ఆగష్టు 15వ, తేది నుండి ప్రత్యేక రీఛార్జీల ద్వారా లభించే రాయితీ రేట్లలో ఈ సేవలను అందించనుంది.

భారత 71వ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్టమర్లకు అదనపు ప్రయోజనాలకు అందించేందుకుగాను నిర్ణయించినట్టు బిఎస్ఎన్ఎల్ అదికారులు ప్రకటించారు.

 BSNL to offer special benefits plans even on roaming from Independence Day

దేశ వ్యాప్తంగా ఈ నెల 15వ, తేది నుండి జాతీయ రోమింగ్‌పై , వాయిస్, ఎస్ఎంఎస్ లేదా స్పెషల్ టారిఫ్ వోచర్స్ , కాంబో వోచర్ల అదనపు ప్రయోజనాలను అందించనున్నట్టు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

సాయుధ దళ సిబ్బంది, నిపుణులు వ్యాపారస్థులు, విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజకం కలుగుతోందని బిఎస్ఎన్ఎల్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలు లేదా టెలికం సర్కిల్‌కు ప్రయాణిస్తున్న వినియోగదారులకు ఈ ప్రయోజనాలు దక్కవని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Come August 15, mobile customers of state-owned BSNL will be able to use services at discounted rate availed through special recharges in their home circle even on roaming.
Please Wait while comments are loading...