Rahul Gandhi: రాహుల్ గాందీ అరెస్టు తప్పదా ? ఏడేళ్ల జైలు శిక్ష..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ లో అంబేద్కర్ ను కించ పరిచేలా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీని ఎన్డీయే ఎంపీలు అడ్డుకున్న క్రమంలో ఇద్దరు కాషాయ ఎంపీలు గాయపడటం కలకలం రేపింది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..రాహుల్ ను అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు.

పార్లమెంట్ ప్రాంగణంలో చోటు చేసుకున్న గొడవల తర్వాత పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన బీజేపీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఎంపీలు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీలు సైతం వెళ్లి బీజేపీ నేతలపై అక్కడే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు రాహుల్ గాంధీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో
భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 117, సెక్షన్ 115, సెక్షన్ 125, సెక్షన్ 131, సెక్షన్ 3(5) వంటివి ఉన్నాయి.

can lop Rahul Gandhi be arrested in case over scuffle at parliament up to 7 years imprisonment

ఆయా కేసుల్లో రాహుల్ దోషిగా నిర్ధారణ అయితే ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ శిక్షలు ఉన్నాయి. ఇందులో సెక్షన్ 117, సెక్షన్ 125 కింద వారెంట్ లేకుండా కూడా అరెస్టు చేయవచ్చు. మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అరెస్టు తప్పనిసరి కాదు.అలాగే ఈ నేరాలన్నీ బెయిలబుల్ మాత్రమే. అంటే ఇవి ఒక నిందితుడికి హక్కుగా బెయిల్ మంజూరు చేయవలసిన నేరాలు. కాబట్టి రాహుల్‌ని అరెస్టు చేసినా బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+