వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్: రసీదులో కారు నెంబర్ వేసిన ట్రాఫిక్ పోలీసులు !

కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని కేసు నమోదు చేశారుకారు నెంబర్ వేసి నోటీసు ఇచ్చి ఫైన్ వసూలు చేసిన పోలీసులుకర్ణాటక ట్రాఫిక్ పోలీసుల వింత ప్రవర్తన, కొత్త రూల్, ఫేస్ బుక్ లో పెట్టారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బైక్ లు నడిపే సమయంలో హెల్మెట్ లేదని ఫైన్ వేసిన సందర్బాలు మనం చాలనే చూశాం. కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని నోటీసు ఇచ్చి అపరాద రుసుం విధించిన విచిత్రమైన ఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది.

ఆదివారం రాత్రి హుబ్బళి నగర ఉత్తర విభాగం పోలీసులు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ లు నడుపుతున్న వారిని గుర్తించి అపరాద రుసుం విధిస్తున్నారు. ఆ సందర్బంలో రవి కాంబ్లే అనే వ్యక్తి కారులో అటువైపు వచ్చాడు. కారు నిలిపిన ట్రాఫిక్ పోలీసులు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించారు.

Car driver is not wearing a helmet at Hubli in Karnataka

కారుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉండటంతో ట్రాఫిక్ పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా రవి కాంబ్లే దగ్గర అపరాద రుసుం వసూలు చెయ్యాలని నిర్ణయించారు. కారు నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 100 ఫైన్ కట్టాలని రవి కాంబ్లేకి సూంచారు.

కారు నడిపే సమయంలో ఎవ్వరూ హెల్మెట్ పెట్టుకోరని, సీటు బెల్ట్ పెట్టుంటారని రవి కాంబ్లే ట్రాఫిక్ పోలీసులతో వాదించాడు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం కారు నెంబర్ వేసి హెల్మెల్ పెట్టుకోలేదని రాసి నోటీసులు ఇచ్చి రవి కాంబ్లే దగ్గర రూ. 100 అపరాద రుసుం వసూలు చేశారు. హుబ్బళి, ధారవాడ జిల్లా ఓలా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి ట్రాఫిక్ పోలీసుల తీరును విమర్శిస్తూ వారు ఇచ్చిన నోటీసును ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల తీరుతో హుబ్బళిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Car driver is not wearing a helmet at Hubli in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X