భగత్ సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు: గాంధీ మునిమనవడిపై కేసు నమోదు

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీపై జలంధర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్‌పై అనుచితి వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ సింగ్‌ను కించపరిచేలా తుషార్ గాంధీ మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేజీ నేత, 'జన్ జాగృతి మంచ్' అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడు అయిన కిషన్ లాల్ శర్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Case filed against Gandhi's great-grandson for making 'offensive' remark against Bhagat Singh

ఈ క్రమంలో తుషార్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మే 8వ తేదీన జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ, "బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్‌ను క్రిమినల్‌గా పరిగణించింది. అందుకే అతనికి పడ్డ మరణశిక్షను రద్దు చేయాలని గాంధీ కోరలేదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+