Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aadhar-Voter Id : ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్-గడువు పెంచిన కేంద్రం..!

దేశంలో ఓటరు కార్డుతో ఆధార్ కార్డు ఐడీ అనుసంధానంలో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో గడువు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

దేశంలో ఎన్నికల అక్రమాల నియంత్రణకు గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ కార్డు ఐడీని ఓటర్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్రం విధించిన గడువు ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. దీంతో ఇవాళ మరోసారి ఈ గడువును పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆధార్-ఓటరు ఐడీ అనుసంధానంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో లింక్ చేసేందుకు విధించిన గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ తాజాగా మరో ఏడాది పాటు ఈ గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఈ గడువు 2023 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకూ పెరిగింది. దీంతో మరో ఏడాది పాటు ఆధార్-ఓటరు కార్డు లింక్ చేసుకునేందుకు జనానికి అవకాశం దొరికింది.

centre extends deadline for linking aadhar id with voter id for one year- here are details

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల ఐడీతో ఓటరు కార్డు ఐడీతో అనుసంధానించేందుకు వీలుగా కేంద్రం.. జనం నుంచి వివరాలు సేకరిస్తోంది. అయితే అనుసంధానం ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. గత ఏడాది డిసెంబర్ వరకూ కేవలం 54 కోట్ల మంది వివరాలు మాత్రమే సేకరించారు. వీటి అనుసంధానం పూర్తి కాకపోవడం, కొత్తగా సేకరించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి లింకింగ్ గడువు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాన్ కార్డును సైతం ఆధార్ తో లింక్ చేసేందుకు విధించిన గడువు కూడా ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో దాన్ని కూడా పెంచాలని విపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+