ఉత్తరాదిలో నాన్ వెజ్ ఫుడ్ డెలివరీల్ని అడ్డుకున్న కేంద్రం ? జొమాటో క్లారిటీతో షాక్..!
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో నిన్న మాంసాహార ప్రియులకు షాకిచ్చింది. అయోధ్యలో జరుగుతున్న రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించేశాయి. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో మాంసాహారాన్ని కూడా నిషేధించాయి. ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ సంస్ధలపై కూడా పడింది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో తాము ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్ వెజ్ ఫుడ్ అందించలేకపోతున్నట్లు జొమాటో వెల్లడించింది.
నిన్న మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఓ కస్టమర్ జొమాటోలో తనకు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కనిపించకపోవడంతో ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. తనకు జొమాటోలో చికెన్ ఐటమ్స్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన జొమాటో తాము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మాంసాహార డెలివరీలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. కేంద్రం అయోధ్య ప్రాణప్రతిష్ట నేపథ్యంలో నాన్ వెజ్ ఫుడ్ తినకుండా అడ్డుకుందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

కేంద్రం ఆదేశాలతో తాము ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ డెలివరీల్ని నిలిపేసినట్లు జొమాటో క్లారిటీ ఇచ్చింది. దీంతో కేంద్రం అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలవుల ప్రకటనతో పాటుగా నాన్ వెజ్ అమ్మకాల్ని కూడా అనధికారికంగా నిషేధించినట్లు అర్ధమవుతోంది. ఆయా రాష్ట్రాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా మాంసం అమ్మకాల్ని కూడా నిషేధించినట్లు తెలుస్తోంది. మాంసంతో పాటు చేపల అమ్మకాల్ని కూడా నిషేధించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications