వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోహినూర్ వెనక్కి తెస్తాం: మాటమార్చిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అరుదైన మన దేశానికి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చారని, దాన్ని వెనక్కి తెచ్చేదిలేదని సంకేతాలు అందించిన కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది. అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి స్పష్టం చేసింది.

తమ ఉద్దేశాలను న్యాయస్థానానికి ఇంకా తెలియ జేయలేదని.. మీడియాలో తప్పుడు కథనాలొచ్చాయని.. తెలిపింది. ఈమేరకు సాంస్క్తృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాల ఆధారంగా ఆ కథనాలు లేవని పేర్కొంది.

విషయం కోర్టు పరిధిలో ఉందని, సొలిసిటర్‌ జనరల్‌ కోహినూర్‌ వజ్రం చరిత్ర గురించి న్యాయస్థానానికి విన్నవించారని పేర్కొంది. ఇంకా ప్రభుత్వ ఉద్దేశాలేవీ తెలియజేయలేదని వివరించింది.

Centre says it will make all efforts to bring back Kohinoor diamond

కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు ఎత్తుకెళ్లలేదని, అలాగే బలవంతంగా తీసుకెళ్లలేదని నాటి పంజాబ్ పాలకులే దాన్ని ఈస్టిఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని సుప్రీం కోర్టులో సోమవారం ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.

'కోహినూర్‌ వజ్రాన్ని బలవంతంగా ఎత్తుకు పోయారని.. లేదా చోరీకి గురైందని చెప్పలేమని, సిక్కు యుద్ధాల్లో సహకారం అందించినందుకు గాను 1849లో మహారాజా రంజిత్‌సింగ్‌ వారసులు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అందజేసినట్లు' సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు నివేదించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. న్యాయస్థానం 6 వారాల గడువు ఇచ్చిన సంగతిని ప్రకటనలో ప్రభుత్వం ప్రస్తావించింది.

English summary
Government made a U-turn on the Kohinoor issue on Tuesday saying it will make all efforts to bring back the valued diamond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X