Chhattisgarh Results 2023: ఛత్తీస్ ఘడ్ లోనూ బీజేపీ లీడ్-కాంగ్రెస్ వెనుకంజ ?
ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని దెబ్బతీస్తూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఛత్తీస్ ఘడ్ లో ఈ ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలు కాగానే ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడింది. ఉదయం మ్యాజిక్ మార్కు స్ధాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ వెనుకబడగా.. ఆరంభంలో వెనుకబడ్డ బీజేపీ ఆ తర్వాత పుంజుకుంది. 90 సీట్లున్న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు ఫలితాల సరళి చెబుతోంది.

ఛత్తీస్ ఘడ్ లో వరుసగా రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే తేల్చాయి. అయితే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. అయితే కౌంటింగ్ ప్రారంభం కాగానే ఆధిక్యంలోనే కనిపించిన కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్ కు వచ్చేసరికి పలుచోట్ల వెనుకబడింది. సీఎం భూపేష్ బఘేల్ తో పాటు పలువురు కాంగ్రెస్ మంత్రులు ఆధిక్యంలోనే ఉన్నప్పటికీ మిగతా చోట్ల మాత్రం బీజేపీ ఆధిక్యంలోకి వస్తోంది.
90 సీట్ల ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే 46 సీట్ల మ్యాజిక్ మార్క్ సీట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ ఇరువురూ 40కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం 46 సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ఆశించిన స్ధాయిలో ప్రజా వ్యతిరేకత లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చినా బీజేపీ కూడా బాగా పుంజుకుందని ఎన్నికల ఫలితాల సరళి నిరూపిస్తోంది.
అయితే ఈ హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్దితిల్లోనూ అధికారంలోకి వస్తుందని అధిష్టానం ధీమాగా ఉంది. దీనికి కారణం పలు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ మార్కుకు ఒకట్రెండు సీట్లు తగ్గినా ఇండిపెండెంట్ల సాయంతో అధికారం సాధిస్తామనే ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications