వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రజనీకాంత్ బిజెపిలో చేరడం లేదు, అద్వానీనీ అందుకే రాష్ట్రపతిని చేయలేదు'

రాష్ట్రపతి పదవిని దళితుడిని ఎంపిక చేయాలని భావించినందునే అద్వానీ కాకుండా రామ్ నాథ్ కోవింద్ ను ఎన్ డి ఏ తరపున రాష్ట్రపతి పదవికి బరిలో దింపుతున్నట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: రాష్ట్రపతి పదవిని దళితుడిని ఎంపిక చేయాలని భావించినందునే అద్వానీ కాకుండా రామ్ నాథ్ కోవింద్ ను ఎన్ డి ఏ తరపున రాష్ట్రపతి పదవికి బరిలో దింపుతున్నట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

రాష్ట్రపతి పదవికి బిజెపి సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానినీ కాకుండా రామ్ నాథ్ కోవింద్ ను ఎందుకు ఎంపికచేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. మంగళవారం నాడు ాయన చెన్నైలో ఓ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.

amit shah on rajinikatnth politics

రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని దళితులకే ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే రామ్ నాథ్ కోవింద్ అన్ని విధాల యోగ్యుడని నిర్ణయానికి వచ్చామన్నారు. అద్వానీ సైతం రామ్ నాథ్ ఎంపికను ప్రశంసించారు. అమిత్ షా.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ కు మద్దతు పలకాల్సిందిపోయి పోటీకి దిగిన విపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు. తాము దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీ మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ గోపాలకృష్ణగాంధీని పోటీకి పెట్టాలనుకొన్నారు కానీ, మేం కోవింద్ పేరు చెప్పేసరికి ఫ్లేట్ ఫిరాయించి మమ్మల్ని కాపీ కొట్టారని అమిత్ షా అన్నారు.

సినీ నటుడు రజనీకాంత్ ఎంతో పరపతి ఉన్న వ్యక్తన్నారు. అయితే ఆయన బిజెపిలో చేరబోతున్నారనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమేని అమిత్ షా ప్రకటించారు. రాజకీయప్రవేశంపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బిజెపిలోకి వస్తానంటే గనకు స్థానిక నేతలను సంప్రదించి ఆ మేరకు నిర్ణయం తీసుకొంటామన్నారు. ఆయన బిజెపిలో చేరకపోయినా మా వ్యూహాలు మాకుంటాయన్నారు.

అన్నాడిఎంకె నేతలపై సిబిఐ దాడులతో తమకు సంబంధం లేదన్నారు. తగిన ఆధారాలున్నందునే వారు దాడులుచేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Cine actor Rajinikanth will join in Bjp a rumour said Amit shah on Tuesday in Chennai. Rajinikanth didn't decide to enter in politics not yet he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X