విజయం: దినకరన్‌ను అభినందించిన హీరో విశాల్
చెన్నై: ఆర్కె నగర్ నుంచి ఘన విజయం సాధించిన టిటివీ దినకరన్‌ను సినీ హీరో విశాల్ అభినందించారు. ఆర్కె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి విశాల్ విఫలప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
దినకరన్‌ను అభినందిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన దినకరన్‌ను కోరారు.

నీటి పారుదల మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నియోజకవర్గం ప్రజలు తీవ్రమైన మంచి నీటి సమస్యను ఎదుర్కుంటున్నారని ఆయన గుర్తు చేశారు. మత్స్యకారుల సమస్యలు కూడా చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని అన్నారు.
ఆ సమస్యలను దినకరన్ పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని కూడా విశాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications