బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు చోట్ల పోటీ: సీఎం సిద్దూ, పరమేశ్వర్ కు హై కమాండ్ క్లారిటీ, మీరే తేల్చుకోండి, చాన్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ సైతం రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిందని తెలిసింది.

Recommended Video

కర్ణాటక చరిత్రలో సిద్దరామయ్య చరిత్ర
ఓటమి భయం !

ఓటమి భయం !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరీ, బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గాల నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించారు. మొదట చాముండేశ్వరీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించిన సిద్దరామయ్య తరువాత ఇంటిలిజెన్స్ నివేదికతో ఆందోళనచెంది బాదామి నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించారు.

సీఎం పదవి పోయింది

సీఎం పదవి పోయింది

కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ 2103 శాసన సభ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కోరెటగెరె నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో సీఎం పదవి పోయింది. తరువాత సీఎం కావాలని ప్రయత్నాలు చేసిన పరమేశ్వర్ కు చివరికి నిరాశే మిగిలింది.

రిస్క్ ఎందుకు !

రిస్క్ ఎందుకు !

గత ఓటమిని ఇప్పటికే మరచిపోలేని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ కోరటగెరెలో ఈసారి కచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉన్నా ఎందుకు రిస్క్ చెయ్యాలి అంటూ బెంగళూరులోని పులకేశీనగర నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించారు. ఎక్కడో ఒక చోట గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో డాక్టర్ జీ. పరమేశ్వర్ ఉన్నారు.

సీఎం ఓటమి లక్షం

సీఎం ఓటమి లక్షం

మైసూరు జిల్లా చాముండేశ్వరీ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యను ఓడించాలని బీజేపీ, జేడీఎస్ లోలోపల ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చాముండేశ్వరీ నియోజక వర్గంలో తాను ఓడిపోతానని నివేదిక వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదని మీడియాకు చెప్పిన సీఎం సిద్దరామయ్య లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు.

మీరే తేల్చుకోండి

మీరే తేల్చుకోండి

ఒక్కోక్కరు రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తే ఇంతకాలం పోటీ చెయ్యాలని నిర్ణయిస్తే ఆ నియోజక వర్గం అభ్యర్థులు నిరాశకు గురౌతారని, మీకు ఇలాంటి అవకాశం ఇస్తే మరికొంత మంది తాము రెండు చోట్ల పోటీ చేస్తామని డిమాండ్ చేసే అవకాశం ఉందని, ఏ నియోజక వర్గంలో గెలుస్తారో మీరే నిర్ణయించుకుని అక్కడ నుంచి మాత్రమే పోటీ చెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం సీఎం సిద్దరామయ్య, డాక్టర్ జీ. పరమేశ్వర్ కు సూచించిందని తెలిసింది.

English summary
The Congress high command is said to have put the brakes on candidates who want to contest from two constituencies in the Karnataka assembly elections 2018. This would mean that both Siddaramaiah and Dr. G Parameshwar who have been wanting to contest from two constituencies will not be permitted to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X