తెరపైకి కాంగ్రెస్ కొత్త చీఫ్ : ఘోర పరాజయంతో అనివార్యమైన ఎంపిక ? .. సోనియా, ప్రియాంక పేర్ల పరిశీలన ?

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అధికారం చేపడుతామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణమెవరు ? అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనా ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం అవసరం ఉందా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

సర్వశక్తులు ఒడ్డినా ..?

సర్వశక్తులు ఒడ్డినా ..?

వాస్తవానికి రాహుల్‌గాంధీ గతంలో కన్నా పరిణితి సాధించారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. రఫెల్ ఒప్పందం, బడాబాబులకు దోచిపెట్టడం, చౌకీదార్ చోర్ హై అంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపి .. గెలిచేందుకు వ్యుహరచన చేశారు. అయినా ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం చూసింది. ఈ ఎన్నికల్లో రాహుల్ అన్నీ తానై వ్యవహరించారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం సహా అన్ని విభాగాల్లో పట్టు సాధించారు. గతంలో మాదిరిగా తల్లి చాటు కొడుకులా ఉండలేదు. ముందుండి .. ముందుకు నడిపించారు. దీనిని బట్టి ఎన్నికల్లో రాహుల్ ఫెయిల్యూర్ స్పష్టమైంది. కనీసం ఆ పార్టీ 100 సీట్లు కూడా దాటలేని పరిస్థితి ఏర్పడింది. యూపీఏ కూటమికే 90 సీట్లు వచ్చాయంటే మోదీ, షా చాణక్యం, చేసిన అభివృద్ధి పనులు ఏ మేరకు పనిచేశాయో అర్థమవుతుంది.

కొత్త నేత ఎవరు ?

కొత్త నేత ఎవరు ?

ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుర్వవైభవం రావాలంటే కొత్త నాయకత్వం పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ పార్టీ శ్రేణుల్లో నాయకత్వంపై సందేహాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పార్టీపై పట్టు సాధించిన రాహుల్ .. అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్లారు. ప్రతిష్టాత్మక న్యాయ్ పథకం ప్రవేశపెడతామని హామీలు ఇచ్చారు. కానీ ప్రజలు ఇవేమీ విశ్వసించలేదు. సో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ మార్పిడి అనేది ఇప్పుడు అనివార్యమైంది. తిరిగి సోనియానా ? లేదంటే ప్రియాంకను తెరపైకి తీసుకురావాలా అనే అంశం ఆ పార్టీ చేతుల్లోనే ఉంది.

సోనియా .. ప్రియాంక ..

సోనియా .. ప్రియాంక ..

కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడంలో సోనియా చాణక్యం పనిచేసింది. ఆమె హయాంలో యూపీఏ 10 పదేళ్లు అధికారం చేపట్టింది. ఆమె చాటున రాహుల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి .. పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టారు. కానీ అతని నాయకత్వ లక్షణాలు, ప్రచారం ఓట్లుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. దీంతో మళ్లీ సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది. దీంతోపాటు తెరపైకి ప్రియాకం గాంధీ పేరు కూడా వస్తోంది. ఆమె ఇటీవల యూపీ తూర్పు ఇంచార్జీగా వ్యవహరించారు. అయితే బీజేపీ గాలిలో ఆమె ప్రభావం కూడా కనిపించలేదు. అయినా ఆమె హవభావాలు, ఇందిరా పోలికలతో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నయ్య రాహుల్ విఫలమవడంతో .. చెల్లి ప్రియాంక తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకే ప్రియాంకు పగ్గాలు అప్పజెప్పాలనే వాదన ఉంది. ఇప్పుడు రాహుల్ ఫెయిల్యూర్‌తో ఆమె పేరు తెరపైకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+