పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడికి కుట్ర.. సీఎం ఇంటివద్ద మారణాయుధాలతో వ్యక్తి అరెస్ట్!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై దాడికి కుట్ర జరిగినట్టుగా తాజాగా చోటు చేసుకున్న ఘటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఒక దుండగుడు ప్రయత్నించిన క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
మమతా బెనర్జీ నివాసం సమీపంలోని లైన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని కలకత్తా పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. కారులో వచ్చిన సదరు నిందితుడు అనుమానాస్పదంగా మమతా బెనర్జీ నివాసం సమీపంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్న పోలీసులు అతడిని తనిఖీ చేశారు.

అతని వద్ద తుపాకీ, కత్తి, కొన్ని నిషేధిత పదార్థాలు, ఆయుధాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు అతని వద్ద వివిధ సంస్థల ఐడెంటిటీ కార్డులు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వ్యక్తిని షేక్ నూర్ ఆలంగా గుర్తించారు.
ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని కారుకు పోలీస్ అని స్టిక్కర్ కూడా వేసి ఉంది. దీంతో పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి.షేక్ నూర్ ఆలం ఎవరు? అసలు ఎందుకు అతను మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోకి వచ్చాడు? అని ఆరా తీస్తున్నారు.
అతని వద్ద ఉన్న మారణాయుధాలు దేనికి ఉపయోగించాలి అనుకున్నాడు? పోలీస్ స్టిక్కర్ కారుకు ఎందుకు వేసుకున్నాడు? అతడిని ఎవరు పంపించారు? దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది? అన్నదాని పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి, వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications