వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసాలపై చల్లటి కబురు వచ్చేనా?: మోడీ ప్రభుత్వం ఆందోళన

హెచ్‌-1బీ వీసాలపై వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. దీనిపై మోడీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హెచ్‌-1బీ వీసాలపై వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. దీనిపై మోడీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం నిర్ణయం ఐటీ ఉద్యోగులకు, భారత విద్యార్థులకు తీవ్రనష్టమని పేర్కొంది.

భారత ప్రయోజనాలు, ఆందోళనల గురించి అమెరికాకు తెలియజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ మంగళవారం నాడు తెలిపారు.

<strong>'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి? </strong>'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి?

ట్రంప్ కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో భారతదేశం చర్యలు ప్రారంభించింది. హెచ్1బీ వీసాలపై తమ ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని అత్యున్నత స్థాయి అమెరికా పాలనా యంత్రాంగం, అమెరికా కాంగ్రెస్‌ వర్గాలకు విజ్ఞప్తి చేసింది.

Conveyed concerns over H1B visa to US: Ministry of External Affairs

హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారుల్లో మూడింట రెండొంతుల మంది భారతీయులే. వీరిలో ఎక్కువ మంది టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి భారత ఐటీ కంపెనీలు లేదా ఐబీఎం, గూగుల్‌ వంటి అమెరికా సంస్థల స్థానిక శాఖల్లో పనిచేసేవారు ఉన్నారు.

<strong>భయపడిందే జరిగింది: ట్విస్ట్.. అమెరికా ఉద్యోగ భర్తీకి కాదు కానీ..</strong>భయపడిందే జరిగింది: ట్విస్ట్.. అమెరికా ఉద్యోగ భర్తీకి కాదు కానీ..

కాగా, కనీస వేతనం 1,30,000 డాలర్లు ఉన్నవారికే హెచ్1బీ వీసాలను జారీ చేయాలని ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. దీనివల్ల స్థానికులకు బదులుగా విదేశీ కార్మికులను నియమించుకోవడం అమెరికాలోని కంపెనీలకు కష్టమవుతుంది. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతుంది.

English summary
As Trump Government moves to tighten H1B visa rules that are going to affect the country’s outsourcing IT giants; India says it has already conveyed its concerns both to the US Government and the US Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X