కేజ్రీవాల్ భార్యకు కరోనా పాజిటివ్: ఐసోలేషన్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది . చివరకు కరోనా సెగ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా తాకింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్
ఇక అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో , ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు . ఢిల్లీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సోమవారం రాత్రి నుండి అమల్లోకి వచ్చిన ఆరు రోజుల లాక్డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఈ రోజు ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కరోనా బారిన పడడంతో ఆయన కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

హోం క్వారంటైన్ అయిన ఢిల్లీ సీఎం .. అయినా కరోనా పరిస్థితిపై సమీక్ష
ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన వెల్లడించారు . కేజ్రీవాల్ తనను తాను హోమ్ క్వారంటైన్ చేసుకున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని విమర్శనాత్మకంగా సమీక్షిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దుర్గేశ్ పాథక్ తెలిపారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ బృందాలు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి అని పాథక్ తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ గత సంవత్సరం కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడి కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నారు.

ఇప్పటికే కరోనా బారిన పడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు
కేజ్రీవాల్ , డిప్యూటీ మనీష్ సిసోడియా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, పార్టీ ప్రతినిధి రాఘవ్ చాధాతో సహా ఆప్ కు చెందిన పలువురు నాయకులు కూడా ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. ఢిల్లీలో ఇటీవల కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. దేశ రాజధాని కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్ననగరంగా మారింది. నగరంలో నేడు 23,000 కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 8.77 లక్షలకు పైగా ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications