వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కొత్త కొలువుకు కౌంట్ డౌన్: 12 కొత్త ముఖాలు, తెలుగువారెవరు?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం, కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన త

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi Cabinet Reshuffle On Sunday : Modi Plans For 2019 So Who Gets What | Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం, కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ఇది.
ఈసారి ఏకంగా 12 మంది కొత్త వ్యక్తులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు ప్రధాని మోడీ. దీనికోసం గురువారం నుంచే ప్రక్రియ మొదలైంది.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం ఇప్పటికే ఏడుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో ఐదుగురు మంత్రులు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తయిన తర్వాత కేబినెట్‌లోకి తీసుకునేవారికి పీఎంవో సమాచారం అందిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.

81 మందితో కేంద్ర మంత్రి మండలి...

81 మందితో కేంద్ర మంత్రి మండలి...

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో 73 మంది సభ్యులున్నారు. గరిష్ఠంగా 81 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకో ఎనిమిది మంది కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏడుగురు మంత్రులు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లోనూ కొత్తవారినే తీసుకోవాలని యోచిస్తోంది ఎన్డీయే సర్కార్‌. అలా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 15 మంది కొత్తవారిని తీసుకునే అవకాశం ప్రధాని మోడీకి ఉంది. అయితే ప్రస్తుతం మంత్రిమండలి సంఖ్యను పెంచే ఆలోచన లేకపోయినా.. కేంద్రమంత్రుల రాజీనామాతో 12 మంది కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల కోసమే...

2019 ఎన్నికల కోసమే...

మరోవైపు 2019లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై దృష్టిపెట్టిన ఎన్డీయే సర్కార్‌.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సమాచారం. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రం నుంచి మరొకరికి కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. ఇటీవలే ఎన్డీయే గూటికి చేరిన జేడీయూకు కూడా మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు రాష్ట్రాలకూ ప్రాధాన్యం...

ఆ రెండు రాష్ట్రాలకూ ప్రాధాన్యం...

మోడీ మంత్రివర్గంలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు కూడా అధిక ప్రాధాన్యం దక్కనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. అలా మొత్తం 12 మంది కొత్త మంత్రులు కేబినెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రానికల్లా దీనిపై మరింత స్పష్టత రావచ్చు.

కీలక శాఖల్లో మార్పులు...

కీలక శాఖల్లో మార్పులు...

కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, స్మృతిఇరానీ తదితరులకు తమ శాఖలతో పాటు అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. జైట్లీ ఆర్థికశాఖతో పాటు రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. మంతివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రక్షణశాఖకు మరో మంత్రిని కేటాయించనున్నారు. ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రాజీనామా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అందుకు స్పందించిన మోడీ ఆయన్ని కాస్త ఆగమని చెప్పారు. అంటే రైల్వేశాఖ మంత్రిని కూడా మార్చే అవకాశం కన్పిస్తోంది. ఇక వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ ను కూడా బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం.

ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరికి?

ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరికి?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వీలుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కొత్త వ్యక్తిని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వెదిరె శ్రీరామ్‌ భువనగిరికి చెందిన వ్యక్తి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపైనా సందిగ్ధత నెలకొంది.

English summary
More than 10 new ministers will be inducted into Prime Minister Narendra Modi's council of ministers tomorrow morning at 10 in a big cabinet revamp. Sources said those who will take oath have to be in Delhi by this evening. At least six ministers, including Rajiv Pratap Rudy, Sanjeev Balyan, Faggan Singh Kulaste, Kalraj Mishra and Bandaru Dattatreya have resigned to make way for new faces. PM Modi's cabinet reshuffle - the third in as many years - has been due for months now, especially in the scenario of vacancies and shifting alliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X