వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూస్టర్ డోస్: 8 నెలల తర్వాతే ఎందుకు..? నిపుణులు ఏమంటున్నారు..

|
Google Oneindia TeluguNews

కరోనాకు వ్యాక్సినే శ్రీరామ రక్ష. అయితే కొవిషీల్డ్, కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు రెండు డోసులు ఇస్తున్నారు. బూస్టర్ డోసు కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. వైరస్ తట్టుకోవాలంటే మూడో డోసు కూడా అవసరమే అంటూ నివేదికలు వస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, ఇతర కొన్ని టీకాలు సింగిల్ డోసు సరిపోతాయి. దేశంలో త్వరలో జాన్సన్ టీకా వచ్చే అవకాశం ఉంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఫెడరల్ హెల్త్ ఆఫీసర్స్ రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న 8 నెలల తర్వాత ప్రజలకు కోవిడ్-19 బూస్టర్‌ డోస్ ఎందుకు అవసరం అవుతుందనే అంశంపై ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.

8 నెలల తర్వాత..

8 నెలల తర్వాత..

8 నెలల తర్వాత ఎందుకు బూస్టర్ డోస్ అవసరమో? కాలక్రమేణా వ్యాక్సిన్‌ ఎలా నిలిచిపోతాయో? అవి దేశంలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొని నిలబడగలవా? అనే విషయాలను చర్చిస్తున్నారు. బూస్టర్‌ డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపుతాయని, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ అసోసియేట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొలీన్ క్రాఫ్ట్ వివరించారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ ఎంత బాగా పనిచేస్తాయో? కాలక్రమేణా వ్యాక్సిన్ సామర్ధ్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్నలు మిగిలి ఉండగా.. బూస్టర్‌ ఎప్పుడు అవసరమవుతాయో? స్పష్టం చేసే విధంగా ముఖ్యమైన ఆధారాలను అందిస్తాయి.

టీకా..

టీకా..

దేశంలో కరోనాకు ముందు ఉన్న పరిస్థితులు నెలకొల్పడానికి అందించాల్సిన వ్యాక్సిన్‌ పరిమాణానికి బ్రిటన్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు దగ్గరగా వచ్చినట్లే కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పేద, ధనిక దేశాల్లో అసమానతలు బయటపడినా.. గుర్తింపు పొందిన చాలా వ్యాక్సీన్లు సీరియస్ కేసులపై, మరణాల నియంత్రణపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. మరికొన్ని గుర్తింపు లేని వ్యాక్సీన్లు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విస్తృతంగా వ్యాక్సిన్‌ను ప్రారంభించిన మొదటి దేశాలలో ఒకటైన ఇజ్రాయెల్ నుండి పరిమిత పరిశోధన వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ ఫైజర్-బయోఎంటెక్ నుండి వ్యాక్సిన్‌ను ఉపయోగించింది. అమెరికా ఔషధ నియంత్రణ అధికారుల నుంచి థర్డ్ బూస్టర్ డోస్‌ను అభ్యర్థించేందుకు ఫైజర్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

థర్డ్ డోసు

థర్డ్ డోసు

వైరస్‌ హాని అధికంగా ఉన్న రోగులకు థర్డ్ డోసు వ్యాక్సిన్‌ను అందిస్తున్నట్లుగా చెబుతున్నాయి కంపెనీలు.ఇజ్రాయెల్ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, వ్యాక్సీన్ రక్షణ అవసరమైన వారికి థర్డ్ డోస్ టీకాను ఇవ్వడం మొదలు పెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడో డోసును వ్యతిరేకిస్తూ, పేద దేశాలకు వ్యాక్సీన్ డోసులను విరాళంగా ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తోంది. అయినప్పటికీ మూడో డోసు అందించడానికి అవసరమైన ప్రయోగాలు గురించి నిపుణుల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో 8 నెలల గ్యాప్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని, వేరియంట్ పురోగతి ఇన్‌ఫెక్షన్‌లతో ముడిపడి ఉంది కాబట్టి, పూర్తిగా వ్యాక్సిన్‌లు వేయించుకున్న వ్యక్తులకు వైరస్ సోకినట్లయితే వైరస్ వ్యాప్తి చెందదు కాబట్టి, అందరూ ముందు రెండు డోసుల వ్యాక్సిన్‌లను వేయించుకోవడం వల్ల కరోనా ఉదృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎనిమిది నెలల్లో బూస్టర్ షాట్‌లు ఎందుకు సిఫారసు చేయబడతాయో వీరు చెబుతున్నారు. కాలక్రమేణా క్షీణిస్తున్న రోగనిరోధక శక్తి మళ్లీ పెంచేందుకు, చెత్త ప్రభావాలను తగ్గించేందుకు మూడో డోసు సాయపడుతుందని చెబుతున్నారు. అయితే తీసుకున్న వ్యాక్సిన్ కూడా 6 నెలల నుంచి గరిష్టంగా 9 నెలల వరకు పనిచేసే ఛాన్స్ ఉంది. అందుకే బూస్టర్ డోసు 8వ నెలలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ అంతం కాదని.. టీకా తీసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు.

Recommended Video

Intranasal Covid Vaccine,మరింత బూస్టర్..! || Oneindia Telugu
కరోనా ఇంపాక్ట్

కరోనా ఇంపాక్ట్

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇటు వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
covid booster dose take after 8 months because of experts study revealed. booster dose will effect of delta variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X