Sitaram Yechury: సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం-ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పైనే..!
కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. తీవ్ర శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను గత నెలలో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటి నుంచీ ఆయన పరిస్ధితి మెరుగు పడలేదు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ సీపీఎం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపింది.
శ్వాస నాళ సమస్యలతో బాధపడుతున్న సీతారాం ఏచూరికి ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సీపీఎం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ ప్రకటనలో వెల్లడించింది. అయినా ఏచూరి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 19న తీవ్ర జ్వరంతో ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆ తర్వాత శ్వాససమస్యలు మరింత ముదిరాయి.ఏచూరికి తాజాగా కంటి శస్త్రచికిత్స కూడా జరిగింది.

తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఎంలో జాతీయ స్థాయికి వెళ్లిన నేత సీతారాం ఏచూరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలోనూ భాగమైన సీపీఎంకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ యూపీఏ ప్రభుత్వంలో సీపీఎం అధికార భాగస్వామిగా ఉంది. కేంద్రంలో మారిన పరిస్ధితుల్లో సీపీఎం ప్రాబల్యం కూడా తగ్గుతూ వస్తోంది. జేఎన్టీయూ విద్యార్ధి అయిన ఏచూరికి ఢిల్లీ సర్కిల్స్ తో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఏచూరి ఆరోగ్యంపై రాజకీయ పార్టీల నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications