వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ అధికారి కేసు......సీబీఐతో దర్యాప్తు చేయించాలి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానస్పదస్థితిలో మరణించారు. రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసి వారి పాలిట సింహ్మస్వప్నం అయిన డి.కే. రవి ఈ విదంగా మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సోమవారం సాయంత్రం ఐఏఎస్ అధికారి రవి కోరమంగల సమీపంలోని తావరకెరె రోడ్డులోని ప్రిస్టేజ్ గ్రూప్ కు చెందిన సెయింట్ జాన్స్ వుడ్ అపార్ట్ మెంట్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు. సంఘటనా స్థలంలో పరిశీలించిన పోలీసులు రవి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అంటున్నారు.

సోమవారం రాత్రి కర్ణాటక హొం శాఖ మంత్రి కే.జే. జార్జ్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డి. కే. శివకుమార్ తదితరులు రవి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎం.ఎన్. రెడ్డి.......

ఎం.ఎన్. రెడ్డి.......

సంఘటనా స్థలంలో పరిశీలించామని, ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని అన్నారు. ఫ్యాన్ కు రవి మృతదేహం వేలాడుతున్నదని ఎం. ఎన్. రెడ్డి చెప్పారు. డీసీపీ రోహిణి నేతృత్వంలో ప్రత్యేక బృందంతో కేసు దర్యాప్తు చేయిస్తున్నామని వివరించారు.

ప్రభుత్వం, పేదల కోసం శ్రమించారు.... జార్జ్

ప్రభుత్వం, పేదల కోసం శ్రమించారు.... జార్జ్

పేదలు సంతోషంగా ఉండాలని ఐఏఎస్ అధికారి రవి ఎప్పుడు శ్రమించే వారని హొంశాఖ మంత్రి కే. జే. జార్జ్ చెప్పారు. అంతే కాకుండ ప్రభుత్వానికి ఆదాయం రావాలని నిత్యం కష్టపడ్డారని అన్నారు. రవి ఏలా మరణించారు అని పూర్తి వివరాలు తెలుసుకుని స్పందిస్తానని అన్నారు.

చాల దురదృష్టకర సంఘటన..... కౌసిక్ ముఖర్జి

చాల దురదృష్టకర సంఘటన..... కౌసిక్ ముఖర్జి

సిన్సియర్ ఐఏఎస్ అధికారి డి.కే. రవి మరణం తీరని లోటు అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి కౌసిక్ ముఖర్జి అన్నారు. రవి కేసు విషయం అన్ని కోణాలలో దర్యాప్తు చెయ్యాలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేం.... మాజీ సీఎం శెట్టర్

ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేం.... మాజీ సీఎం శెట్టర్

ఐఏఎస్ అధికారి డి.కే. రవి ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆయన పనితీరు బాగుంటుంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేమని మాజీ ముఖ్య మంత్రి, విదాన సౌధలో ప్రతి పక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ అన్నారు. రవి మరణానికి గల కారణాలు అందరికి తెలియాలని, ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

సమాజం మారాలని కష్టపడ్డారు..... మాజీ సీఎం కుమారస్వామి

సమాజం మారాలని కష్టపడ్డారు..... మాజీ సీఎం కుమారస్వామి

ఐఏఎస్ అధికారి రవి గ్రామవాస్తవ్యం, దలితుల ఇండ్లలో బోజనం చేసి సమాజంలో మార్పు రావాలని శ్రమించారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ప్రభుత్వం కష్టకాలంలో ఉన్న సమయంలో పన్నులు చెల్లించని రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై దాడులు చేసి పన్ను వసూలు చేశారని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విదంగా పాటు పడ్డారని గుర్తు చేశారు.

అన్ని కోణాలలో దర్యాప్తు చెయ్యండి....... యడ్యూరప్ప

అన్ని కోణాలలో దర్యాప్తు చెయ్యండి....... యడ్యూరప్ప

ఐఏఎస్ అధికారి రవి మృతి కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ సభ్యుడు బీ.ఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఇలాంటి సిన్సియర్ అధికారి కేసు దర్యాప్తులో నిర్లక్షం చెయ్యరాదని సూచించారు.

సీబీఐతో దర్యాప్తు చెయ్యించాలి..... జోషి

సీబీఐతో దర్యాప్తు చెయ్యించాలి..... జోషి

ఐఏఎస్ అధికారి డి.కే. రవి మృతి కేసు దర్యాప్తు సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. అయిల్ దందా మంజునాథ్ ను హత్య చేసిన విదంగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి తీరని నష్టం......... మంత్రి డి.కే. శివకుమార్

రాష్ట్రానికి తీరని నష్టం......... మంత్రి డి.కే. శివకుమార్

ఐఏఎస్ అధికారి రవి మరణం రాష్ట్రానికి తీరని లోటు అని కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డి.కే. శివకుమార్ అన్నారు. రవి మొబైల్ కు ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎవరు బెదిరించారు, ఆయనమరణానికి గలకారణాలు వెలుగు చూడాలని చెప్పారు.

ఈ చావు అత్యంత భాదకరం..... మాజీ హొం శాఖ మంత్రి ఆర్. అశోక్

ఈ చావు అత్యంత భాదకరం..... మాజీ హొం శాఖ మంత్రి ఆర్. అశోక్

రవి ఈ విదంగా మరణిస్తారని కలలో కూడ అనుకోలేదని రాష్ట్ర మాజీ హొం శాఖ మంత్రి ఆర్. అశోక్ చెప్పారు. రవికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని అనేక సార్లు వెలుగు చూసిందని , ఈవిషయంపై ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని అన్నారు.

English summary
Additional commissioner of commercial tax Department D.K.Ravi was found dead in his apartment on Monday, March 16, 2015 evening. Who said what about D.K.Ravi death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X