Dainik Bhaskar Exit Poll 2025: బీహార్ లో ఎన్డీయే సునామీ..! కూటమి అవుట్..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కేరళ వార్తాపత్రిక దైనిక్ భాస్కర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇవాళ బీహార్ లో రెండో దశ పోలింగ్ ముగిశాక ప్రకటించిన ఈ ఫలితాల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు తేలింది. అధికార ఎన్డీయేకు మరోసారి పగ్గాలు అప్పగించినట్లు దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీహార్ లో ఎన్డీయే సునామీ ధాటికి విపక్ష మహాకూటమి కొట్టుకుపోయిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఈసారి బీహార్ అసెంబ్లీలో ఉన్న 243 సీట్లలో ఎన్డీయే ఏకంగా 160 సీట్ల వరకూ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. మొత్తంగా 145 నుంచి 160 సీట్లను ఈసారి ఎన్డీయే సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే విపక్ష మహాకూటమి కేవలం 73 నుంచి 91 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని దైనిక్ భాస్కర్ పోల్ తెలిపింది. ఇతరులకు మిగిలిన సీట్లు దక్కనున్నట్లు వెల్లడించింది.

దైనిక్ భాస్కర్ అంచనాలను బట్టి చూస్తుంటే బీహార్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లోనూ ఓటర్లు ఎన్డీయేవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రెండు దశల ఓటింగ్ లోనూ భారీ ఎత్తున తరలివచ్చి ఓటు వేసిన ప్రజలు పూర్తిగా ఎన్డీయే కూటమికి అండగా నిలిచినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-ఆర్జేడీతో కూడిన మహాకూటమితో పాటు ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కు కూడా ఓటమి తప్పేలా లేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications