అమిత్ షాకు ఝలక్‌! రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించి.. మద్దతు కోరమన్న ఉద్ధవ్‌ ఠాక్రే

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎంతో ఆశతో తన గుమ్మాన్ని తొక్కిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఝలక్‌ ఇచ్చారు. ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయండి.. ఆ తర్వాతే మద్దతు కోరండని అమిత్‌ షాకు ఠాక్రే తేల్చిచెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

దీంతో ఎన్నో అంచనాల మధ్య సాగిన అమిత్‌షా-ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ అసంపూర్ణంగా ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థుల విషయమై శివసేన ఇప్పటికే ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమిత్ షా-ఠాక్రే మధ్య 75 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఉద్ధవ్‌తోపాటు ఆయన కొడుకు ఆదిత్య, షాతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడవ్నిస్‌ కూడా పాల్గొన్నారు.

Uddhav Thackeray

పేరుకు మిత్రపక్షాలైనా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన బంధం ఉప్పు-నిప్పులా కొనసాగుతోంది. ఇటీవల రుణమాఫీ విషయమై బాహాటంగానే బీజేపీ సర్కారుపై సేన నిప్పులు కురిపించింది. ఈ నేపథ్యంలో జరిగిన అమిత్‌ షా-ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఎన్డీఏ భాగస్వాముల్లో దాదాపు అందరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కట్టబెట్టారని, ఈ విషయంలో శివసేన కూడా తమతో కలిసి రావాలని అమిత్ షా తెలుపగా, ఉద్దవ్ ఠాక్రే ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

తాము ఇప్పటికే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేర్లను రాష్ట్రపతి అభ్యర్థిగా సూచించామని, బీజేపీ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయడమో, లేదంటే.. మరో అభ్యర్థిని సూచించడమో చేయాలని, అభ్యర్థిని మొదట ఖరారు చేస్తే.. మద్దతు విషయం తాము ఆలోచిస్తామని ఉద్దవ్ తేల్చి చెప్పినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The much hyped meeting between BJP President Amit Shah and Shiv Sena President Uddhav Thackeray over Presidential polls ended inconclusively. The Shiv Sena is learnt to have told Shah that the BJP should first decide on a name and then seek support. The Shiv Sena has already suggested two names from its side. The meeting between Shah and Thackeray lasted for 75 minutes. Apart from Uddhav, his son Aditya from the Shiv Sena and Chief Minister Devendra Fadnavis from the BJP participated in the meeting. The meeting had assumed significance especially in the backdrop of the recently strained ties between the allies over farm loan waiver.
Please Wait while comments are loading...