వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో డేంజర్ సిచుయేషన్: కరోనా, ప్లూ విలయతాండవం, 80 శాతం నివాసాలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 ఇళ్లలో 8 ఇళ్లలో కేసులు ఉన్నాయి. ఇదీ గత నెలరోజుల్లోనే వెలుగుచూసింది. చాలా మంది జ్వరం, ముక్కు కారడం, నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపించాయి. చాలా మంది హోం కిట్ ద్వారా పరీక్షలు చేసుకుంటున్నారు. అదీ వైరల్ ఫీవరా.. లేదంటే కరోనా అని టెస్ట్ చేసుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏదైనా ఇతరులకు సోకుతుంది. ముఖ్యంగా చిన్నారులు వేగంగా ప్రభావితం అవుతున్నారు.

జూలై ఆగస్టు నెలలో తమ కుటుంబంలో ఎవరికో బాగోలేదని సర్వే ద్వారా తెలిసింది. గతేడాది 41 శాతం మంది ఇబ్బంది పడితే.. ఈ సారి అదీ 82 శాతానికి చేరింది. కరోనా కేసులు కూడా ఈ సారి పెరుగుతున్నాయి. మహమ్మరి ముగిసిపోలేదని గుర్తించాలని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రజలను కోరారు.

Delhi faces Covid, flu double, 80 percent homes affected

ఢిల్లీలో గత 24 గంటల్లో 917 కరోనా కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. వైరల్, ప్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీరలో చాలా మందికి తలనొప్పి, గొంతునొప్పి, ఆలసట ఉందని చెబుతున్నారు. కొందరు జ్వరం అని అంటున్నారు.

నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరిదాబాద్‌లో 11 వేల మందికి సర్వే చేశారు. వీరిలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీలో నెలరోజుల్లో చాలా మంది వైరల్ ఫీవర్, ఫ్లూతో బాధపడుతున్నారు. 54 శాతం మంది ప్లూ నుంచి కోలుకున్నారు. 23 శాతం మంది మాత్రం కోలుకోలేదు. 8 శాతం మంది అయితే తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 15 శాతం మంది మాత్రం ఎలాంటి సమస్యను ఎదుర్కొలేదు.

English summary
Delhi-NCR region is witnessing its worst bout of viral fever and Covid with eight out of 10 households affected in the last 30 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X