సుఖేష్ కు డబ్బులిచ్చిన నరేష్ అరెస్టు, శశికళను కూడ విచారించే అవకాశం?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన దినకరన్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తున్నారు పోలీసులు.ఈ కేసులో పోలీసులు పురగోగతిని సాధించారు.ఈ కేసు విషయమై జైలులో ఉన్న శశికళను కూడ పోలీసులు విచారించే అవకాశం ఉందని సమాచారం.

ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. .ఈ కేసులో కోర్టు అనుమతితో దినకరన్ ను ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొన్నారు ఢిల్లీ పోలీసులు.

గురువారం నాడు దినకరన్ కు చెన్నై తీసుకువచ్చారు పోలీసులు. దినకరన్ తో పాటు ఆయన సహాయకుడు మల్లిఖార్జున్ ను కూడ పోలీసులు విచారించారు. మరో వైపు దినకరన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

Delhi police arrested hawala agent naresh

దినకరన్ భార్య అనురాధను కూడ పోలీసులు గురువారం నాడు ప్రశ్నించారు.అయితే ఈ కేసులో బెంగుళూరు, కొచ్చిల్లో కూడ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

సుఖేష్ కు హావాలా రూపంలో దినకరన్ ను డబ్బులను అందించారని పోలీసులు గుర్తించారు. సుఖేష్ కు డబ్బులు అందించిన హావాలా ఏజంట్ నరేష్ కుమార్ ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు. థాయ్ లాండ్ నుండి ఇండియాకు చేరుకోగానే నరేష్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో బెంగుళూరు, కొచ్చిలో కూడ డబ్బులు చేతులు మారినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ మేరకు బెంగుళూరుతో పాటు కొచ్చిలో కూడ విచారణ జరిపించాలని పోలీసులు భావిస్తున్నారు.మరో వైపు ఇదే కేసు విషయమై జైలులో ఉన్న శశికళను కూడ పోలీసులు విచారించే అవకాశం ఉంది.ఈ మేరకు జైలు అధికారులను అనుమతి కోరనున్నారు ఢిల్లీ పోలీసులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police arrested hawala agent naresh on friday.Police will question sasikala also in this case.important evidence gathered delhi police from dinakaran and his aide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి