నోట్ల రద్దు వివాదంలో హీరో, ఇంటికి పోలీసు భద్రత
శింబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోని ఓ పాటను పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఏడాది పూర్తయిన సందర్భంగా విడుదల చేశారు. దీనిని శింబు పాడారు. ఈ పాటలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాన్ని విమర్శించారు.
చెన్నై: శింబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోని ఓ పాటను పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఏడాది పూర్తయిన సందర్భంగా విడుదల చేశారు. దీనిని శింబు పాడారు. ఈ పాటలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాన్ని విమర్శించారు.
వివిధ బ్యాంకుల్లో ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన మాల్యా గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మాల్యా లాంటి వారు పారిపోతుంటే సామాన్య ప్రజలు మాత్రం దేశంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నేతలు శింబు ఇంటి ముందు ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications