డేరాబాబాకు ముప్పు: జైలులో 20 మందితో భద్రత

రోహతక్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ళ శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్‌ రహీమ్ సింగ్‌కు రోహ్‌తక్ జైల్లో కూడ 20 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటుచేశారు.

జైలులో కూడ డేరా బాబా ప్రాణాలకు ముప్పుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో జైలులో రామ్‌రహీమ్ సింగ్‌కు భద్రతను కల్పించారు. సుమారు 20 మంది సెక్యూరిటీ గార్డులు డేరాబాబాకు జైలులో కూడ రక్షణ కల్పిస్తున్నారు.

‘Dera Sacha Sauda chief Ram Rahim has 15-20 guards inside Rohtak jail’

జైలు నుంచి విడుదలైన సోను పండిత్‌ అనే వ్యక్తి ఈ విషయాలను చెప్పారు.. 'గుర్మీత్‌ జైలుకు వచ్చినప్పటి నుంచి ఖైదీలకు సమస్యలు ఎక్కువయ్యాయి. గుర్మీత్‌ ఉండటంతో జైల్లో ఆంక్షలు విధించారు. దీంతో తోటి ఖైదీలు అతడిపై కోపంగా ఉన్నారు. గుర్మీత్‌కు ప్రాణహాని ఉండటంతో 15 నుంచి 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు' అని పండిత్‌ తెలిపాడు.

ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న పండిత్‌ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. అంతేగాక.. గుర్మీత్‌కు ఇప్పటి వరకూ జైల్లో ఎలాంటి పని అప్పగించలేదని పండిత్‌ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+