వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి హామీలు బేఖాతర్: పెరిగిన క్రైమ్ గ్రాఫ్

ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ నేరాల నియంత్రణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల సహరాన్‌పూర్ జిల్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ నేరాల నియంత్రణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల సహరాన్‌పూర్ జిల్లాలో అల్లర్ల నివారణ కోసం పలువురిని అరెస్ట్ చేసినా అదుపులోకి రాలేదు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, అత్యాచార ఘటనలు పెరిగాయే తప్ప తగ్గలేదు. సహరాన్‌పూర్ జిల్లాలో దాడుల వల్ల ఆస్తుల ధ్వంసం, దోపిడీల పర్వం అనునిత్యం పెరుగుతున్నాయి. అల్లరిమూక పోలీసుల వాహనాలను వదిలి పెట్టలేదు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయి అధికారులు సహరాన్‌పూర్ జిల్లా పరిధిలో విస్త్రుత పర్యటనలు జరిపినా సాధారణ పరిస్థితులు నెలకొల్పలేదు.
గమ్మత్తేమిటంటే గతనెల 16వ తేదీన ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ, సదార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో హిందుత్వ సంస్థల కార్యకర్తలే విధ్వంసకాండకు పూనుకున్నారు. ఈ ఘటన అధికార బీజేపీకి, పోలీసులకు మధ్య సవాల్‌గా పరిణమించింది. దాడుల్లో పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసులపై దాడి చేసినప్పుడు వారు సహజంగా తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. పోలీసుల బైక్ ను కూడా ఆందోళన కారులు తగులబెట్టారు.

సీనియర్ ఎస్పీ బదిలీ ఇలా

సీనియర్ ఎస్పీ బదిలీ ఇలా

ఫతేపూర్ సిక్రీలో ఎస్సై సర్వీస్ రివాల్వర్ ఎత్తుకెళ్లారు. కానీ హిందుత్వ సంస్థలపై కేసుల నమోదు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు సంకటంగా పరిణమించింది. బీజేపీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు. దాడులకు పాల్పడిన సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టిన ఆగ్రా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) డాక్టర్ ప్రదీప్ సింగ్ ను బదిలీ చేయి వెయిటింగ్ లిస్టులో ఉంచారు. సదరు కార్యకర్తలపై నమోదైన దోపిడీ, దాడి, హత్య తదితర సెక్షన్ల కేసులన్నీ ఎత్తివేశారు. బెయిల్ పై విడుదలయ్యేలా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చకచకా చర్యలు తీసుకున్నది. పోలీసుశాఖను తన ఆధీనంలోకి తీసుకునేందుకు శాఖలో పూర్తిస్థాయిలో బదిలీలు నిర్వహించారు.

లక్నోలో కూతుళ్ల హత్యతో బావురుమన్న తండ్రి

లక్నోలో కూతుళ్ల హత్యతో బావురుమన్న తండ్రి

హింసకు, అల్లర్లకు సహరాన్‌పూర్ జిల్లా ఒక్కటే కేంద్ర బిందువు కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సహా అన్ని ప్రాంతాల్లో నేరాల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. గోమతి నగర్ ప్రాంతంలో అల్లరిమూక దాడికి పాల్పడ్డారు. సునీతా దివాకర్, ఆమె కుటుంబంపై దాడి చేసిన అల్లరిమూకలు తుపాకులు ఎక్కుపెట్టి, విలువైన ఆభరణాలను దోచుకుని పారిపోయారు. ఇప్పటికీ సునీతా దివాకర్ షాక్ నుంచి కోలుకోలేదు. దొంగల ముఠా నగదు, ఆభరణాలతోపాటు చివరకు వాటర్ బాటిళ్లు కూడా దోచుకెళ్లారు. లక్నో వాసి లాల్ బహదూర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న బార్యను చూసి ఇంటికి వచ్చే సరికి ఆయన ఇద్దరు కూతుళ్లను హతమార్చారు. లక్నో నగరంలో పారా ప్రాంతంలో జంట హత్య కేసుల దర్యాప్తులో బిజీగా పోలీసులు ఉన్నారు. సీఎంగా ఆదిత్యనాథ్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు దఫాలు నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తానని హెచ్చరికలు జారీచేస్తూ వచ్చినా ఆచరణలో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి.

పెరిగిన హత్యలు.. దోపిడీలు

పెరిగిన హత్యలు.. దోపిడీలు

యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరాలు పెరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. గత జనవరిలో 16, మార్చిలో 23, ఏప్రిల్‌లో 33 నేరాలు జరిగాయి.గత జనవరిలో 249 కేసులు నమోదైతే మార్చిలో 421, ఏప్రిల్‌లో 412 ఘటనలు చోటుచేసుకున్నాయి. జనవరిలో 286 హత్యలు చోటుచేసుకుంటే మార్చిలో 396, ఏప్రిల్‌లో 399 హత్యలు జరిగాయి. జనవరి నుంచి మార్చి వరకు అత్యాచారాలు 244 నుంచి 378 ఘటనకు పెరిగితే. ఏకంగా ఏప్రిల్‌లో 393 ఘటనలు చోటుచేసుకున్నాయి. నేరాల నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ అన్ని చర్యలు తీసుకుంటామని భీషణ ప్రకటనలు ఎన్ని చేసినా ఆచరణ శూన్యమని అంటున్నారు. వ్యవస్థీక్రుత నేరాలను అదుపులోకి తెస్తామన్నారు. 2015లో ఏప్రిల్‌లో 99, 2016లో 77 ఘటనలు, 2017లో 91 హింసాత్మక ఘటనలు జరిగాయి. 2015లో దోపిడీలు 992 ఘటనలు, 2016లో 1186, 2017లో 1352 దోపిడీలు జరిగాయి. 2015లో హత్యలు 1395, 2016లో 1513 జరిగితే 2017లో 1364 చోటు చేసుకున్నాయి. 2015లో 849 అత్యాచార ఘటనలు జరిగితే అది 2016లో 1030, ఈ ఏడాదిలో 1266 లైంగిక దాడులకు పెరిగింది.

English summary
For the last several days Saharanpur is simmering as the rioters run amok vandalising property and indulging in arson. High profiled visits of Director General of Police (DGP) could not bring in calmness even as dozens were rounded up. Police personnel were attacked and vehicles set on fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X