వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ధోనీ తప్పుకున్నాడా, తప్పుకోమన్నారా? ఫ్రెండ్ అంటూ సచిన్ సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో మూడో టెస్ట్ తర్వాత ధోనీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 90 టెస్టులు ఆడిన ధోనీ 4,876 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. 2014 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

ధోనీ తన టెస్ట్ కెరీర్లో ఆరు శతకాలు, 33 అర్ధశతకాలు చేశాడు. 2008 నవంబరులో నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో ధోనీ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. టెస్టులో ధోనీ రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు కైవసం చేసుకున్నాడు. ఆ రెండు కూడా ఆస్ట్రేలియాతో కావడం గమనార్హం. వికెట్ కీపర్‌గా 256 క్యాచ్‌లు, 38 స్టంపింగులు చేశాడు. వరుసగా అత్యధిక టెస్ట్ విజయాలు నమోదు చేసిన సారథిగా ధోనీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

వరుసగా 11 టెస్టులు ఆడగా వాటిలో విజయాలు 8, డ్రాలు 3. 2009లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచులో భారత జట్టు టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను ధోనీ సారథ్యంలోనే సాధించింది. అప్పుడు 726/9 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ 2-0తో గెలుపొందడంతో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ చేరింది.

2013 ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరిగిన టెస్టులో 7 క్యాచ్‌లు ఒక స్టంపింగుతో మోంగియా పేరుతో ఉన్న రికార్డ్ సమం చేశాడు. కాగా, ధోనీ రిటెర్మెంట్ పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెలక్టర్లు కూడా ఆయనను తప్పుకోమని చెప్పి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతను తప్పుకున్నాడా లేక తప్పుకోవాల్సి వచ్చిందా అనే చర్చ సాగుతోంది.

సచిన్ సలహా

సచిన్ సలహా

ధోనీ రిటైర్మెంట్ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. టెస్టు క్రికెట్లో అద్భుతమైన కెరీర్ చవిచూసినందుకు ధోనికి అభినందనలు తెలిపాడు. ధోనీతో కలిసి ఆడటాన్ని తాను ఎంతగానో ఆస్వాదించానని చెప్పాడు. ధోనీ ఇక పైన వన్డే వరల్డ్ కప్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. నెక్క్ట్ టార్గెట్ 2015 వరల్డ్ కప్ మై ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశాడు.

అందుకే తప్పుకున్నాడని గవాస్కర్

అందుకే తప్పుకున్నాడని గవాస్కర్

రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించాడు. తనకు ఇది ఆశ్చర్యం కలిగించలేదన్నాడు. ధోనీ మునిగిపోతున్న నావను వదిలిపెట్టి వచ్చాడన్న విమర్శలను తోసిపుచ్చాడు. ఇలాంటి వాదనలతో తాను అంగీకరించనని, తానూ సారథిగా వ్యవహరించానని, భారం పెరిగిపోయిన దశలో ఈ నిర్ణయం తప్పేం కాదన్నాడు. కోహ్లీ నాయకత్వ పగ్గాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని ధోనీ గుర్తించాడన్నాడు. దీంతో అతను సరిగా ఆలోచించాడన్నాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ మెల్‌బోర్న్ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. 60 టెస్టులకు నాయకత్వం వహించిన ధోనీ సారథ్యంలో... భారత్ 27 గెలవగా, 18 ఓడింది. 15 డ్రా అయ్యాయి.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ధోనీ మెల్‌బోర్న్ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

హఠాత్తుగా ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలను విశ్లేషిస్తే... రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ధోని సేన విదేశాల్లో కేవలం కాగితం పులులనే పేరును నిలబెట్టుకుంటా వరుసగా విఫలమవుతుండటం ఒకటి కాగా, మరొకటి ధోని వరుసగా సెలవులు తీసుకోవడం.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

సారథిగా చివరి టెస్టు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌కు చెందిన క్రిస్ రోజర్స్‌తో మెల్‌బోర్న్ టెస్ట్ అనంతరం చేయి కలుపుతున్న దృశ్యం.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఆసీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు. మూడో టెస్ట్ ఐదో రోజు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన ఆనందంలో ఆసీస్ ఆటగాడు రెయాన్ హారిస్. కోహ్లీ 54 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ మెల్‌బోర్న్ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. 60 టెస్టులకు నాయకత్వం వహించిన ధోనీ సారథ్యంలో... భారత్ 27 గెలవగా, 18 ఓడింది. 15 డ్రా అయ్యాయి.

English summary
MS Dhoni has retired from Test cricket with immediate effect following the drawn Test against Australia in Melbourne. Virat Kohli will take over as India captain for the final Test of the series, which India have already lost, in Sydney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X