వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్‌ను నాశనం చేస్తారా?: సుప్రీం ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను నాశనం చేయాలని అనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజ్‌ పరిసర ప్రాంతాలను రక్షించి అద్భుత కట్టడాలను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణవేత్త మెహతా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి ఢిల్లీ వరకూ అదనంగా ఏర్పాటు చేసే రైల్వే ట్రాక్‌ కోసం దాదాపు 450 చెట్లను తొలగించనున్నారు. దాని వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలగడంతో పాటు, దాని ప్రభావం తాజ్‌పై పడనుంది.

Does government want to destroy the Taj Mahal: SC

ఈ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'తాజ్‌మహల్‌ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి. దాన్ని ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటుందా? ప్రస్తుతం తాజ్‌మహల్‌ ఎలా ఉందనే దానికి సంబంధించిన ఫొటోలను అసలు చూశారా? ఆన్‌లైన్‌లో తాజ్‌ ఫొటోలు చూడండి.. ఎలా ఉందో కనిపిస్తుంది' అని జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదే చేయాలనుకుంటే యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తాజ్‌ను నాశనం చేయాలనుకుంటుందని.. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ లేదా దరఖాస్తును దాఖలు చేయలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసింది.

English summary
Launching a scathing attack on the government, the Supreme Court asked if it intended to destroy the Taj Mahal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X