LPG Cylinder Price : మళ్లీ పెరిగిన గ్యాస్ సిలెండర్ ధర-ఈసారి ఎంతో తెలుసా ?
దేశవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తుల ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటుండగా.. తాజాగా మరోసారి చమురు సంస్ధలు ధరల మోత మోగించడం మొదలుపెట్టాయి. ఈ మధ్య గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలెండర్ల ధరల్ని రూ.50 మేర పెంచిన చమురు సంస్ధలు ఇప్పుడు మళ్లీ పెంచాయి.
గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఇప్పటికే వెయ్యి రూపాయుల దాటిపోగా.. ఇవాళ మరో 3.5 రూపాయలు పెంచుతూ చమురు సంస్ధలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల స్ధిరంగా కొనసాగుతుండగా.. గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇప్పటికే వెయ్యి రూపాయలకు పైగా వెచ్చించి గ్యాస్ సిలెండర్లు కొనలేక జనం ప్రభుత్వం ఇచ్చిన ఉజ్వల గ్యాస్ సిలెండర్ల రీఫిల్లింగ్ చేయించడమే మానేస్తున్న పరిస్ధితి. ఇప్పుడు తాజా పెంపుతో గృహవినియోగదారులపై మరింత భారం పడబోతోంది.

కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తరహాలోనే గ్యాస్ ధరల్ని కూడా చమురు సంస్ధల చేతుల్లోనే పెట్టడంతో అవి భారీగా లాభాలు అర్జిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరల్లో స్ధిరత్వం లేకపోయినా భారత్ లో మాత్రం స్ధిరంగా ధరలు పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడేళ్లలో లక్షల కోట్లు లాభాలార్జించిన చమురు సంస్ధలు ఇంకా జనాన్ని పీల్చి పిప్పి చేయడం మాత్రం మానడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ధరలు పెరిగినప్పుడు భారీగా మోత మోగిస్తున్న ఆయా సంస్ధలు.. తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా అవే ధరల్ని కొనసాగించడం ద్వారా వినియోగదారుల్ని మోసం చేస్తున్నాయన్న ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్నాయి.
-
భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..! -
LPG: కోలుకోవడానికి 4 ఏళ్లు? వణుకు పుట్టిస్తున్న వార్త -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications