58 ఏళ్ల తర్వాత దూరదర్శన్ లోగో మారబోతుంది
ప్రభుత్వ రంగ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ తన లోగోను మార్చనుంది. ఇప్పుడున్న లోగో మరికొద్ది రోజుల్లో జ్ఞాపకంగా మిగలనుంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ తన లోగోను మార్చనుంది. ఇప్పుడున్న లోగో మరికొద్ది రోజుల్లో జ్ఞాపకంగా మిగలనుంది. కాలానుగుణంగా, యువతకు కనెక్ట్ అయ్యేలా కొత్త లోగోను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఇందు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. 58 ఏళ్ల తర్వాత లోగో మార్చబోతోంది. ఈ మేరకు ప్రసారభారతి సీఈవో శశి ఎస్ వెంపటి వెల్లడించారు.
మనుషుల కన్ను రూపంలో ఉండే ఇప్పటి లోగోను 1959లో దూరదర్శన్ ఏర్పాటు చేసినప్పుడు ఎంపిక చేశారు. అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉంది. ప్రస్తుత ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, యువతను ఆకర్షించేలా కొత్త లోగో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మనదేశంలో 30 ఏళ్లలోపు యువతీయువకులు చాలామంది ఉన్నారని, వీరంతా దూరదర్శన్ కంటే చాలా చిన్నవారని, అప్పటి ప్రజల మనోభావాలకు, ఇష్టాలకు అనుగుణంగా ఆ లోగోను ఎంచుకున్నారని చెప్పారు. కానీ, ప్రస్తుత యువత ఆసక్తివేరుగా ఉందని, అందువల్ల వారిని అందరినీ ఆకట్టుకునేలా లోగో ఉండాలని చెప్పారు.
A new Logo for Doordarshan reflecting the Aspirations of a New India while preserving the nostalgia https://t.co/8XDOoweDJf
— Shashi Shekhar (@shashidigital) July 24, 2017
దేశవ్యాప్తంగా దూరదర్శన్ 23 చానళ్లుగా ఉంది. ప్రస్తుతం ఈ లోగో కోసం పోటీ నిర్వహించి, అందులో గెలిచిన వారికి రూ.లక్ష బహుమతిగా ఇస్తారు.
ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లకు తక్కువగా ఉన్న వారేనని చెప్పారు. కాగా, కొత్త లోగో నవభారత్ ఆకాంక్షలను ప్రతిబింభించేలా ఉండాలని చెబుతున్నారు. తమ తమ డిజైన్లు ఇచ్చేందుకు చివరి తేదీ ఆగస్టు 13.












Click it and Unblock the Notifications